బన్నీకి చెల్లిగా నివేదా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా గ్యాప్ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ [more]

Update: 2019-05-23 09:40 GMT

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా గ్యాప్ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బన్నీ సరసన మరోసారి పూజ హెగ్డే నటిస్తుంది. అలానే బన్నీ తల్లి పాత్రలో సీనియర్ హాట్ హీరోయిన్ ‘టబు’ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రకి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందట. అందుకే ఆ పాత్ర కోసం నివేదా థామస్ ను ఎంపిక చేశారనే టాక్ వినిపించింది.

ఆ వార్తలో నిజం లేదు

క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కాబట్టి నివేదా థామస్ ఈ పాత్రను చేయడానికి అంగీకరించిందని చెప్పుకున్నారు. అయితే ఈ రూమర్ రోజురోజుకి ముదిరిపోవడంతో లేటెస్ట్ గా నివేదా థామస్ స్పందించింది. ఇప్పటివరకు ఈ మూవీ కోసం తనని ఎవరూ సంప్రదించలేదని, ఈ సినిమాలో తాను చెల్లెలి పాత్రను చేయనున్నాననే వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. దీంతో నివేదా థామస్ తనపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టినట్టైంది. మరి బన్నీ చెల్లిగా ఎవరు నటిస్తారో చూడాలి.

Tags:    

Similar News