నిత్య కొత్త అవతారం!!

నిత్య మీనన్ నటన తో అద్భుతాలు సృష్టస్తుంది. ఆలా అని గ్లామర్ షో చెయ్యదు… అందాలు ఆరబొయ్యడంలో నిత్యా మీనన్ కి కొన్ని పరిధులున్నాయి. అందుకే నిత్య [more]

Update: 2020-06-19 16:10 GMT

నిత్య మీనన్ నటన తో అద్భుతాలు సృష్టస్తుంది. ఆలా అని గ్లామర్ షో చెయ్యదు… అందాలు ఆరబొయ్యడంలో నిత్యా మీనన్ కి కొన్ని పరిధులున్నాయి. అందుకే నిత్య మీనన్ కి అవకాశాలు కూడా తగ్గాయి. స్టార్ హీరోల సినిమాల్లో నిత్యా మీనన్ కి అవకాశాలు రాకపోవడానికి కారణం కూడా ఆమె గ్లామర్ షో చెయ్యదు.. బరువు కంట్రోల్ చేయదనే. అయితే నిత్యా మీనన్ కూడా వచ్చిన కథలు వచ్చినట్టుగా ఒప్పుకోఉండా.. కథ నచ్చి, తన పాత్ర నచ్చితేనే సినిమాలు చేస్తుంది. అందుకే నిత్యా మీనన్ చేసిన సినిమాలు చాలా తక్కువ. అయితే తాజాగా నిత్యా మీనన్ కొత్త అవతారం ఎత్తబోతుందట.

తాను నటిస్తున్న సినిమాల షూటింగ్స్ లో తన సీన్స్ కి బ్రేక్ వచ్చినప్పుడు కెమెరా వెనుక నిలబడి చిత్రీకరణ తీరును నిత్య పరిశీలిస్తూ ఉంటుందట. ఈ అభిరుచితోనే నిత్య మీనన్ దర్శకురాలు కావాలని కోరిక పుట్టిందట. అందుకే ఈ లాక్ డౌన్ సమయంలో నిత్య మీనన్ కొని కథలు రాసుకుని స్క్రిప్ట్ కూడా తయారు చేసుకుందట. ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాలు పూర్తి కాగానే నిత్యా మీనన్ దర్శకత్వం వైపు తన చూపు మరల్చి.. మెగా ఫోన్ పట్టాలని చూస్తుందట.

Tags:    

Similar News