నితిన్ పెళ్లి విషయమై ఇంట్రెస్టింగ్ న్యూస్

కరోనా వైరస్ ప్రభావంతో అన్ని నిలిచిపోయాయి. దానితో శుభకార్యాలేమిటి.. కనీసం ఇల్లు దాటే పరిస్థితులు కూడా లేవు. పెళ్లిళ్లు రద్దయ్యాయి. తాజాగా టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లి [more]

Update: 2020-03-25 04:13 GMT

కరోనా వైరస్ ప్రభావంతో అన్ని నిలిచిపోయాయి. దానితో శుభకార్యాలేమిటి.. కనీసం ఇల్లు దాటే పరిస్థితులు కూడా లేవు. పెళ్లిళ్లు రద్దయ్యాయి. తాజాగా టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లి దుబాయిలో జరగాల్సి ఉండగా.. దుబాయ్ లో నితిన్ పెళ్లి వేడుకలు కరోనా ప్రభావంతో రద్దయ్యింది. ఇక నితిన్ పెళ్లి కూడా టోటల్ గా రద్దు చేసుకున్నాడనే టాక్ నడిచింది. ఇక కరోనా తో అట్టుడుకుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకు నితిన్ 20 లక్షల ఆర్ధిక సహాయం చేసాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి చెక్ అందించాడు నితిన్.

అయితే నితిన్ పెళ్లి రద్దు కాలేదు అని.. అనుకున్న టైం కె నితిన్ పెళ్లి జరగబోతుంది అని చెబుతున్నారు. నితిన్ పెళ్లి అతికొద్దిమంది చుట్టాల మధ్యలో హైదరాబాద్ లోని నితిన్ ఇంట్లోనే జరగబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే నితిన్ పెళ్లి పనులు చాలా నిరాడంబరంగా మొదలయ్యాయని.. ఇంటి వద్దే ఈ పెళ్లి కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారని…. కేవలం కొద్దిమంది దగ్గరి చుట్టాలే ఈ పెళ్ళికి హాజరవుతారని.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున నితిన్ తన పెళ్ళికి ఎవ్వరిని పిలవలేకపోతున్నట్లుగా చెబుతున్నారు

Tags:    

Similar News