నితిన్ ఆ రీమేక్ పై ఆసక్తి చూపడం లేదా?

మూడు వరస ప్లాప్ తో ఉన్న నితిన్ వరసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. వెంకీ కుడుములతో భీష్మ సినిమా తో ఫిబ్రవరి 14 న [more]

Update: 2019-11-29 06:40 GMT

మూడు వరస ప్లాప్ తో ఉన్న నితిన్ వరసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. వెంకీ కుడుములతో భీష్మ సినిమా తో ఫిబ్రవరి 14 న రాబోతున్న నితిన్, వెంకీ అట్లూరి తో దిల్ సే సినిమా చేస్తున్నాడు. ఆతర్వాత చంద్రశేఖర్ ఏలేటితో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. అయితే నితిన్ కి మొన్నటివరకు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫిలిం అంధాదున్ మీది మోజుండేది. గత ఏడాది బాలీవుడ్ లో చిన్న సినిమాగా తెరకెక్కి ఎటువంటి అంచనాలు లేకుండా కలెక్షన్స్ వర్షం కురిపించిన బ్లాక్ బస్టర్ సినిమా అంధాదున్. ఆ సినిమా రీమేక్ రైట్స్ ని నితిన్ ఫాదర్ సుధాకర్ దక్కించుకున్నాడు.

అయితే అంధాదున్ రీమేక్ రైట్స్ కొన్నది నితిన్ కోసమే అనుకున్నారు. కాదు నితిన్ కూడా అంధాదున్ రీమేక్ పై ఆసక్తి చూపాడు. ఆ రీమేక్ రైట్స్ కొన్నప్పటినుండి ఆ రీమేక్ తెరకెక్కించే డైరెక్టర్ కోసం నితిన్ చాలా వెతుకుతున్నాడు. అయితే సుధీర్ వర్మ డైరెక్షన్ లో నితిన్ అంధాదున్ రీమేక్ చేయబోతున్నాడనే న్యూస్ కూడా ప్రచారంలోకొచ్చింది. తాజాగా నితిన్ అంధాదున్ రీమేక్ చేసి రిస్క్ చేయడమెందుకు… మన నిర్మాణంలో ఎవరైనా ఫ్రెష్ హీరో తో ఆ సినిమా రీమేక్ చేస్తే బావుంటుంది అనే ఆలోచన చేస్తున్నట్టుగా టాక్. నితిన్ కోసం సుధాకర్ రెడ్డి అంధాదున్ రైట్స్ కన్నాడు. కానీ నితిన్ అలోచించి ఆలోచించి ఓ యంగ్ హీరో తో ఆ సినిమా చేస్తే బావుంటుందని ఫిక్స్ అయ్యాడట.

Tags:    

Similar News