డిసెంబర్ కి ఎంత క్రేజుందో… ఫిబ్రవరికి అంతే

జనవరి లో సంక్రాంతికి ముందు డిసెంబర్ చివరి వారంలో మీడియం రేంజ్ హీరోలంతా మీడియం బడ్జెట్ సినిమాల్తో పోటాపోటికిదిగుతారు. డిసెంబర్ చేజారితే.. సంక్రాంతికి సాహసం చెయ్యకుండా ఫిబ్రవరికి [more]

Update: 2019-11-27 07:06 GMT

జనవరి లో సంక్రాంతికి ముందు డిసెంబర్ చివరి వారంలో మీడియం రేంజ్ హీరోలంతా మీడియం బడ్జెట్ సినిమాల్తో పోటాపోటికిదిగుతారు. డిసెంబర్ చేజారితే.. సంక్రాంతికి సాహసం చెయ్యకుండా ఫిబ్రవరికి వెళతారు కొంతమంది. సంక్రాతి బరిలో పెద్ద హీరోలకు భయపడే హీరోలంతా ఫిబ్రవరి మొదటి, రెండో వారాలకి వెళతారు. మరి డిసెంబర్ చివరిలో బాలకృష్ణ రూలర్, ప్రతి రోజు పండగే, డిస్కో రాజాలు దిగుతున్నాయి. మరి మూడు సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న సినిమాలే. ఇక నితిన్ భీష్మ కూడా డిసెంబర్ లోనే అన్నారు కానీ… చివరికి నితిన్ భీష్మ ఫిబ్రవరికి వెళ్ళిందిగా అంటున్నారు.

విజయ్ దేవరకొండ వరల్డ్ ఫెమస్ లవర్ ని హడావిడీ లేకుండా ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున దింపుతున్నాడు. అదే రోజు నితిన్ భీష్మ, దిల్ రాజు 96 సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయంటూ కొత్త న్యూస్ వినబడుతుంది. ముందుగా విజయ్ దేవరకొండ వరల్డ్ ఫెమస్ ని ఫిబ్రవరి 14 అనగానే… శర్వానంద్ – సమంత 96, నితిన్ భీష్మ లు అదే రోజు అవడానికి సిద్దమవుతున్నాయి. మరి విజయ్ కి క్రేజ్ ఉంది, 96 రీమేక్ అంటే మంచి అంచనాలున్న సినిమా, అలాగే భీష్మ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. మరి డిసెంబర్ చివరిలో సినిమాల సందడి ఎంతుందో… ఫిబ్రవరిలోను అంతే ఉంది. అయితే విజయ్ దేవరకొండ వరల్డ్ ఫెమస్ ని వీటి మీద పోటీకి దింపకుండా డిసెంబర్ లోనే విడుదల చేసుంటే బావుండేది. కానీ విజయ్ మాత్రం తన సినిమాని ఫిబ్రవరికి తీసుకెళ్లాడు.

Tags:    

Similar News