నితిన్, ఏలేటి సినిమా టైటిల్ ఇదే

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఛలో ఫేమ్ వెంకీ డైరెక్షన్ లో భీష్మ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తరువాత రంగ్ దే అనే టైటిల్ [more]

Update: 2019-10-05 08:52 GMT

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఛలో ఫేమ్ వెంకీ డైరెక్షన్ లో భీష్మ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తరువాత రంగ్ దే అనే టైటిల్ తో మరొకటి చేస్తున్నాడు. ఈ రెండు మూవీస్ కాకుండా నితిన్ మరో సినిమా చేస్తున్నాడు. దాని టైటిల్ చదరంగం అనుకుంటున్నారు. విభిన్న చిత్రాలు తీసే దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ చేస్తున్న సినిమాకు చదరంగం అనే టైటిల్ పెట్టాలని ఆలోచిస్తున్నారట. సినిమా కథకి టైటిల్ కి కరెక్ట్ గా సెట్ అవుతుందని భావిస్తున్నారు టీం.

నితిన్ సరసన రకుల్…..

ఇందులో నితిన్ చదరంగం ఆటగాడుగా కనిపించనున్నాడు. సినిమాలో నితిన్ జీవితానికి, ఈ గేమ్ కు చాలా దగ్గర సంబంధం ఉంటుందట. అందుకే ఈ సినిమా కు ఆ టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. త్వరలోనే రెండో షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు. నితిన్ కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా, రెండో హీరోయిన్ గా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ప్రియాప్రకాష్ వారియర్ కనిపిస్తుంది. ఈసినిమా కి సంబంధించి మరిన్ని విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.

 

 

Tags:    

Similar News