నితిన్ సూపర్ స్పీడు ఎలా ఉందొ చూడండి!

గత ఏడాది కరోనా క్రైసిస్ తో కాలం కరిగిపోయింది. టైం కి విడుదల కావాల్సిన సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. ఈ ఏడాది మొదలయ్యింది మొదలు సినిమాల [more]

Update: 2021-02-19 07:48 GMT

గత ఏడాది కరోనా క్రైసిస్ తో కాలం కరిగిపోయింది. టైం కి విడుదల కావాల్సిన సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. ఈ ఏడాది మొదలయ్యింది మొదలు సినిమాల రిలీజ్ డేట్స్ తో హీరోల హడావిడి మాములుగా లేదు. అందులో ఓ యంగ్ హీరో అయితే ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించి షాకిచ్చాడు. గత ఏడాది లాక్ డౌన్ కి ముందు భీష్మ తో భారీ హిట్ కొట్టిన నితిన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరో వారంలో నితిన్ చెక్ రిలీజ్ కాబోతుంది. దాని తర్వాత వెంకీ అట్లూరి డైరెక్షన్ లో నితిన్ చేసిన రంగ్ దే విడుదలకు డేట్ ప్రకటించాడు.
కీర్తి సురేష్ – నితిన్ జంటగా తెరకెక్కుతున్న రంగ్ దే ఈ ఏడాది మార్చ్ 26 న విడుదల కాబోతుంది. ఈ సినిమాపై ట్రేడ్ లోను ప్రేక్షకుల్లోని మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ముచ్చటగా మూడో సినిమా ఏది అంటే.. నితిన్ ఎంతో ఇష్టపడి చేస్తున్న బాలీవుడ్ రీమేక్ అంధాధున్ సినిమాని కూడా నితిన్ ఈ ఏడాదే రిలీజ్ చేసేస్తున్నాడు. నితిన్ – నభ నటేష్ – తమన్నా ముఖ్యపాత్రలుగా తెరకెక్కుతున్న అంధాధున్ రీమేక్ ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఇంకా టైటిల్ అనౌన్స్ చెయ్యని చిత్ర బృందం ముందుగా డేట్ లాక్ చేసింది. అంధాధున్ రీమేక్  సినిమా జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల కాబోతుంది అని.. ఓ పోస్టర్ తో సహా రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర బృందం. ఈ పోస్టర్ లో నితిన్ ష‌ర్టుపై స్వెట‌ర్ వేసుకొని పియానో ప్లే చేస్తూ క‌నిపిస్తున్నాడు. అంధాధున్ లో ఆయుష్మాన్ ఖురానా పాత్ర ని నితిన్ చేస్తున్నాడు.

Tags:    

Similar News