నితిన్ ను లైన్ లో పెడదామనుకుంటే…

రమేష్ వర్మ…ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలిసి ఉండదు. ఇతను డైరెక్ట్ చేసిన సినిమాలు అటువంటివి. ఇప్పుటివరకు రమేష్ కు ఒక్క హిట్ లేదు. కానీ బెల్లంకొండ [more]

Update: 2019-03-22 11:28 GMT

రమేష్ వర్మ…ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలిసి ఉండదు. ఇతను డైరెక్ట్ చేసిన సినిమాలు అటువంటివి. ఇప్పుటివరకు రమేష్ కు ఒక్క హిట్ లేదు. కానీ బెల్లంకొండ తనతో సినిమా చేయడానికి ఓకే చేసాడు. ఒక పక్క అది చేస్తూనే నితిన్ తో సినిమా అంటూ అనౌన్స్ మెంట్ ఇచ్చేసారు. కానీ నితిన్ ఏమో చంద్రశేఖర్ యేలేటి సినిమా అని ట్వీటర్ లో అనౌన్స్ చేసాడు. రమేష్ వర్మ దగ్గర అయిదేళ్ల బట్టి ఒకే కథ ఉందని, అదే బెల్లంకొండకు చెప్పారని…అయితే బెల్లంకొండతో సడన్ గా తమిళ చిత్రం రాక్షసన్ రీమేక్ చేస్తున్నారని, ఇప్పడు అదే కథ పట్టుకుని నితిన్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే నితిన్ ఇప్పట్లో ఖాళీగా లేడు అని తేలిపోయింది. నితిన్ ప్రస్తుతం కుడుముల భీష్మ, యేలేటి చంద్రశేఖర్, సూర్యప్రతాప్ ల సినిమాలు చేయాలి. ఏదేమైనా రాక్షసన్ తరువాత తేలుతుంది అసలు వ్యవహరం ఏంటి అనేది.

Tags:    

Similar News