నితిన్ కి... వెంకీ అయినా హిట్ ఇస్తాడా..?

Update: 2018-10-29 06:54 GMT

ప్రస్తుతం మూడు సినిమాల వరస ఫ్లాప్స్ తో ఉన్న నితిన్ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. లై సినిమా దగ్గరనుండి... ఛల్ మోహన రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాల వరకు వరస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్రీనివాస కళ్యాణం కూడా డిజాస్టర్ అవడంతో.. నితిన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఆచితూచి మొదలు పెడుతున్నాడు. ఛలో తో యావరేజ్ హిట్ అందుకున్న వెంకీ కుడుములతో నితిన్ తన నెక్స్ట్ మూవీని మొదలు పెట్టబోతున్నాడు. అనుభవమున్న డైరెక్టర్స్ కూడా నితిన్ తో సినిమాలు చేసి బోల్తా పడ్డారు.

ఛలో డైరెక్టర్ తో...

మరి ఛలో సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నాడు వెంకీ కుడుములు. కాకపోతే ఛలో సినిమా లోబడ్జెట్ తో తెరకెక్కి భారీ వసూళ్లని కొల్లగొట్టడంతో వెంకీకి మంచి పేరొచ్చింది. అంతేకాని ఛలో సినిమాలో విషయం ఉందని కాదు. అలాగే నాగ శౌర్య ఓన్ బ్యానర్ లో తెరకెక్కినది కాబట్టి ఆ సినిమాకి భారీ ప్రమోషన్స్ ఛలో టీం చేసింది. అలా సినిమాకి టాక్ బాగుండి కలెక్షన్స్ అదరగొట్టేసింది. మరి యావరేజ్ దర్శకుడు నితిన్ కి ఎలాంటి హిట్ ఇస్తాడో కానీ... నితిన్ మాత్రం తన హిట్ బాధ్యతనంతా వెంకీ కుడుములు మీదే పెట్టినట్లుగా కనబడుతుంది. ఇక వెంకీ - నితిన్ కాంబో మూవీ నవంబర్ నుండి పట్టాలెక్కబోతుంది.

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలోనూ...

వెంకీ సినిమాతో పాటు నితిన్ క్రియేటీవ్ డైరెక్ట‌ర్ చంద్రశేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని తెలుస్తోంది. చంద్రశేఖ‌ర్ ఏలేటి - నితిన్ కాంబో చిత్రాన్ని భ‌వ్య క్రియేష‌న్స్ నిర్మించ‌నుంద‌ని స‌మాచారం. ప్రస్తుతం ప్రై ప్రొడక్షన్ లో ఈ మూవీ వచ్చే ఏడాది మొదట్లో సెట్స్ మీదకెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

Similar News