నితిన్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

కెరీర్ పరంగా హీరో నితిన్ కొంచం వెనక్కి పడే ఉన్నాడు. నితిన్ తెలుగుతెరకు పరిచయమై దశాబ్దం పైనే అవుతున్న ఇంతవరకు తనకంటూ ఓ మార్కెట్ ని ఏర్పర్చుకోలేకపోయాడు. [more]

Update: 2019-01-17 11:03 GMT

కెరీర్ పరంగా హీరో నితిన్ కొంచం వెనక్కి పడే ఉన్నాడు. నితిన్ తెలుగుతెరకు పరిచయమై దశాబ్దం పైనే అవుతున్న ఇంతవరకు తనకంటూ ఓ మార్కెట్ ని ఏర్పర్చుకోలేకపోయాడు. ‘ఇష్క్’ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు అనుకున్న నితిన్ ‘లై’, ‘ఛల్ మోహన రంగ’ సినిమాలతో నిరాశపరిచాడు. దిల్ రాజు నిర్మించిన ‘శ్రీనివాస కల్యాణం’తో పర్లేదని అనిపించుకున్న నితిన్ ప్రస్తుతం ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

హీరోయిన్ గా రష్మిక…

వెంకీ విపించిన కథ నితిన్ కు బాగా నచ్చడంతో వెంటనే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసి ఫినిష్ చేశారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళుతున్న ఈ సినిమాకు ‘భీష్మ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. కింద టాగ్ లైన్ గా ‘సింగిల్ ఫరెవర్’ ఖరారు చేసారు. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, నితిన్ జోడీగా రష్మిక మందన్న కనిపించనుంది. మిగిలిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Tags:    

Similar News