నితిన్ కు బన్నీ హీరోయిన్..!

Update: 2018-06-25 11:32 GMT

టాలీవుడ్ అల్లు అర్జున్ 'దేశముదురు' సినిమాతో కుర్రకారు కలల రాణిగా మారిన హీరోయిన్ హన్సిక ప్రస్తుతం కోలీవుడ్ లో అగ్రకథానాయికగా వెలుగొందుతూ వస్తుంది. ఆమె తెలుగులో అడపాదడపా మాత్రమే సినిమాలు చేసింది. ఎక్కువ సినిమాలు మాత్రం తమిళంలో చేసింది. దాదాపు అక్కడ పెద్ద హీరోలు అందరి పక్కన నటించింది. తెలుగులో ఆమె ఓ నాలుగేళ్లుగా సరైన సినిమా చేయలేకపోయింది. మంచు విష్ణుతో 'లక్కున్నోడు'.. గోపీచంద్ తో 'గౌతమ్ నంద' సినిమాలు చేసినా అవి ఆమెకు నిరాశనే కలిగించాయి.

మళ్లీ నితిన్ తో...

అయితే ఆమె తెలుగులో నితిన్ సినిమాలో చేయడానికి అంగీకరించినట్టు సమాచారం. నితిన్ హీరోగా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని చేయడానికి దర్శకుడు వెంకీ కుడుముల సన్నాహాలు చేసుకుంటున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ 'భీష్మ' అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. గతంలో వీరి కాంబినేషన్ లో 'సీతారాముల కల్యాణం లంకలో' అనే సినిమా వచ్చి డిజాస్టర్ గా నిలించింది. మళ్లీ ఇప్పుడు రెండోసారి నితిన్ కు జోడిగా నటించనుంది. ఈమూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

Similar News