అమ్మా ... ఒట్టు పెళ్లి చేసుకుంటా..!

Update: 2018-07-23 06:49 GMT

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న నితిన్ ను గత కొంత కాలం నుండి తన తల్లి పెళ్లి చేసుకోమని చెబుతున్నా అవి ఏమీ పట్టించుకోకుండా పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఇప్పట్లో లేదని చెబుతూ వచ్చినా డైరెక్టర్ సతీష్ వేగేశ్న చెప్పిన 'శ్రీనివాస కల్యాణం' కథ వినగానే పెళ్లి చేసుకోవాలన్న కోరిక అయితే వచ్చిందని నితిన్ చెప్పాడు.

పెల్లి అంటే ఇంత కష్టమా..?

నిన్న ఈ సినిమాకు సంబంధించి ఆడియో ఈవెంట్ హైదరాబాద్ లో జరగగా..అందులో నితిన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ... ‘‘ఈ సినిమా చేస్తున్నప్పుడు తనకి పెళ్లి చేసుకోవాలని అనిపించింది..సెట్స్ లో పూజలు..మంత్రాలూ..వ్రతాలు చూసి పెళ్లి అంటే ఇంత కష్టమా? అనిపించింది. అయితే ఎట్టి పరిస్థితిలో పెళ్లి చేసుకుంటా.. అమ్మ నీ మీద ఒట్టు..పెళ్లి చేసుకుంటా’’ అని అనడంతో అక్కడున్న ప్రేక్షకులు మొత్తం చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు.

కేరీర్ లో ఉత్తమ సినిమా అవుతుంది.

ఇక ఈ సినిమా చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నానని.. తన కెరీర్ లో ఇది వన్ అఫ్ ది బెస్ట్ మూవీ అవుతుందని నితిన్ చెప్పాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది .

Similar News