నితిన్ భీష్మ స్టోరీ ఇదే..!

కెరీర్ పరంగా హీరో నితిన్ కొంచెం వెనుకబడి ఉన్నాడు. నితిన్ హిట్ మొహం చూసి చాలా ఏళ్లు అయిపోతుంది. అతని లేటెస్ట్ మూవీస్ చల్ మోహన్ రంగ, [more]

Update: 2019-04-15 10:24 GMT

కెరీర్ పరంగా హీరో నితిన్ కొంచెం వెనుకబడి ఉన్నాడు. నితిన్ హిట్ మొహం చూసి చాలా ఏళ్లు అయిపోతుంది. అతని లేటెస్ట్ మూవీస్ చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. దీంతో నితిన్ కొంచెం తెలివిగా అలోచించి కొంత గ్యాప్ తీసుకుని రెండు సినిమాలతో ముందుకు వస్తున్నాడు. ఛలో సినిమాతో హిట్ అందుకున్న వెంకీ కుడుములుతో నితిన్ ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. వీరి కాంబినేషన్ లో సినిమాను అనౌన్స్ చేయడమే కాకుండా సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

ఫుడ్ పాయిజన్ అంశంతో…

ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇందులో నితిన్ ఫుడ్ పాయిజన్ అనే అంశంపై పోరాటం చేస్తూ కనిపిస్తాడు. ఫుడ్ పాయిజన్ ఒక సీరియస్ అంశం. దానిని అంతే సెన్సిబుల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడట దర్శకుడు. ‘భీష్మ’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ చిత్రమే కాకుండా మరొక చిత్రం కూడా చేయనున్నాడు నితిన్. వీటి డీటెయిల్స్ త్వరలోనే తెలియనున్నాయి.

Tags:    

Similar News