నితిన్ వారికే ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారో..?

లై, ఛల్ మోహన రంగా, శ్రీనివాస కళ్యాణం వంటి డిజాస్టర్స్ తో ఉన్న నితిన్ శ్రీనివాస కళ్యాణం సినిమా తర్వాత వెంకీ కుడుములతో భీష్మ చిత్రాన్ని చేస్తున్నాడు. [more]

Update: 2019-03-30 07:34 GMT

లై, ఛల్ మోహన రంగా, శ్రీనివాస కళ్యాణం వంటి డిజాస్టర్స్ తో ఉన్న నితిన్ శ్రీనివాస కళ్యాణం సినిమా తర్వాత వెంకీ కుడుములతో భీష్మ చిత్రాన్ని చేస్తున్నాడు. నితిన్ బర్త్ డే సందర్భంగా భీష్మ ప్రీ లుక్, ఫస్ట్ లుక్ లను వదిలింది చిత్ర బృందం. ఫస్ట్ లుక్ ఎంతో హడావిడిగా చేసినా ఇంకా భీష్మ సినిమా ఆఫీసియల్ గా సెట్స్ మీదకెళ్లలేదు. ఇక ఆ సినిమాతో పాటుగా హోలీ రోజున చంద్రశేఖర్ ఏలేటితో మరో సినిమాని అనౌన్స్ చేసాడు నితిన్. అసలే ఫ్లాప్స్ లో ఉన్న నితిన్ మరొక ఫ్లాప్ డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది. అందులోనూ ఐదుగురు హీరోలు రిజెక్ట్ చేసిన కథని నితిన్ ఒప్పుకుని చంద్రశేఖర్ ఏలేటితో సినిమా చేస్తున్నాడు.

మళ్లీ ఫ్లాప్ డైరెక్టర్ కే…

తాజాగా మరో ఫ్లాప్ డైరెక్టర్ తో నితిన్ సినిమాని తన పుట్టిన రోజున ప్రకటించడంతో నితిన్ ఫ్యాన్స్ బాగా వర్రీ అవుతున్నారు. శ్రేష్ట్ మూవీస్ నిర్మాణంలో ఇంతకుముందు తనతో ఛల్ మోహన్ రంగా చేసి డిజాస్టర్ ఇచ్చిన కృష్ణచైతన్యకి నితిన్ మరొక ఛాన్స్ ఇచ్చాడట. తన పుట్టిన రోజున నితిన్ స్వయంగా కృష్ణ చైతన్యతో తన సినిమాని ప్రకటించాడు. మరి తనకి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి మరో అవకాశం ఇవ్వడం అనేది నితిన్ ని మెచ్చుకోవాల్సిన విషయమే. రౌడీ ఫెలోతో డైరెక్టర్ గా పరిచయమైన కృష్ణ చైతన్య నారా రోహిత్ తో రౌడీఫెలో చేసి ఫ్లాప్ కొట్టాడు. మరి నితిన్ ఏ ఉద్దేశ్యంతో ఇలా ఫ్లాప్ డైరెక్టర్స్ కి అవకాశాలిస్తున్నాడో ఆయనకే తెలియాలి.

Tags:    

Similar News