మ‌హ‌ర్షి రిజ‌ల్డ్ పై ఆధార‌ప‌డ్డ నిఖిల్ సినిమా

యంగ్ హీరో నిఖిల్ ప్రసుతం చేస్తున్న మూవీ అర్జున్‌ సురవరం రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా [more]

Update: 2019-05-08 11:58 GMT

యంగ్ హీరో నిఖిల్ ప్రసుతం చేస్తున్న మూవీ అర్జున్‌ సురవరం రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడడంతో ఈసారి తదుపరి తేదీ ప్రకటించడానికి నిఖిల్‌ కూడా మొహమాట పడుతున్నాడు. రిలీజ్ డేట్ ప్రకటించి మళ్లీ వాయిదా వేస్తే అతన్ని బాగా ట్రోల్ చేస్తారు అని తెలుసు. అందుకే మహర్షి టాక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మహర్షి కనక సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటే దానికి తన సినిమాకి కనీసం రెండు వారాలు అయిన గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

మ‌హ‌ర్షి సినిమా రిజ‌ల్ట్ పై

ఒకవేళ మహర్షి మామూలుగానే ఆడుతున్నట్టయితే కనుక మే 17న విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక అదేరోజు విడుదల అవుతున్న అల్లు శిరీష్ ‘ఏబిసిడి’పై నిఖిల్ కి చింత లేదు. ఇంత లేట్ చేసినా తరువాత మహర్షికి ఎదురెళ్లి వచ్చే వసూళ్లు రాకుండా చేసుకోవడం కంటే దాన్ని రిజల్ట్ వచ్చాకే అప్పుడు రిలీజ్ డేట్ పై క్లారిటీకి వద్దాం అని నిఖిల్ తో పాటు నిర్మాతలు కూడా భావిస్తున్నారు. అసలే చిన్న సినిమా కావ‌డంతో ఏమాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు. పైగా నిఖిల్ కి ఈ సినిమా చాలా కీలకం.

Tags:    

Similar News