హమ్మయ్య గుడ్డిలో మెల్ల

ప్రస్తుతం టాలీవుడ్ లో లావణ్య త్రిపాఠి కెరీర్ కి ఫుల్ స్టాప్ అన్న రేంజ్ లో ఆమె కెరీర్ ఉంది. ట్రెడిషనల్ లుక్ నుండి గ్లామర్ లుక్ [more]

Update: 2019-11-30 05:26 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో లావణ్య త్రిపాఠి కెరీర్ కి ఫుల్ స్టాప్ అన్న రేంజ్ లో ఆమె కెరీర్ ఉంది. ట్రెడిషనల్ లుక్ నుండి గ్లామర్ లుక్ లోకి మారిన లావణ్యకి అదృష్టం కలిసి రావడం లేదు. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తున్నప్పటికీ…లావణ్య త్రిపాఠి కి అవకాశాలు ఇచ్చే నాథులు కనిపించడం లేదు. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోయినా… ఉన్న ఒక్క సినిమా కోసం లావణ్య టెన్షన్ అంతా ఇంతా కాదు. నిఖిల్ తో కలిసి నటించిన అర్జున్ సురవరం నిన్నటివరకు ఎప్పుడు విడుదలవుతుందో తెలియక సతమతయిన లావణ్య కి ఆ సినిమా పక్కా విడుదల అన్నాక… సినిమా హిట్ కొడుతుందో ? లేదో అనే టెన్షన్ పట్టుకుంది.

ఎందుకంటే ఆ సినిమా హిట్ పైన లావణ్య భవితవ్యం ఆధారపడి ఉంది. తాజాగా విడుదలైన అర్జున్ సురవరం సినిమాకి ప్రేక్షకులు హిట్ టాక్ ఇవ్వగా.. క్రిటిక్స్ మాత్రం యావరేజ్ టాక్ ఇచ్చారు. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన అర్జున్ సురవరం సినిమా కథ, కథనం, కామెడీ వర్కౌట్ అవడంతో… హిట్ టాక్ పడింది. ఈ సినిమాలో హీరోయిన్ గా లావణ్య నటనకు క్రిటిక్స్ కూడా మిక్స్డ్ మార్కులేసారు. ఒకరు ఈ సినిమాలోలావ‌ణ్య అందంగా క‌నిపించింది. కొన్ని సీరియ‌స్ స‌న్నివేశాల్లోనూ క‌నిపించింది. అయితే రెగ్యుల‌ర్ నాయిక పాత్ర మాత్రం కాదు అంటే హీరోయిన్ లావణ్య త్రిపాఠిది నామమాత్రమైన పాత్ర అన్నారు. మరొకరు వరుస డిజాస్టర్ లతో ఉన్న లావణ్య కి ఈ సినిమా మళ్ళీ లైఫ్ ఇచ్చిందని అన్నారు. ఇక లావణ్య పాత్ర ఈ సినిమా కథకి కీలకం. లావణ్య త్రిపాటి తన అందంతో మాత్రమే కాక నటనతో కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. హిట్ చూసి చాలాకాలం అయిన లావణ్య త్రిపాఠికి ఈ సినిమా మంచి విజయం అందించింది అనే చెప్పాలి

Tags:    

Similar News