ఇక రీమేక్స్ జోలికి వెళ్ళడట

స్ట్రయిట్ కథలతో సినిమాలు చేసినప్పుడు యావరేజ్ హిట్స్ అయినా కొట్టిన నిఖిల్ కి రీమేక్స్ కలిసి రావడం లేదు. కిర్రాక్ పార్టీ అంటూ కన్నడ రీమేక్ చేసిన [more]

Update: 2019-12-02 07:13 GMT

స్ట్రయిట్ కథలతో సినిమాలు చేసినప్పుడు యావరేజ్ హిట్స్ అయినా కొట్టిన నిఖిల్ కి రీమేక్స్ కలిసి రావడం లేదు. కిర్రాక్ పార్టీ అంటూ కన్నడ రీమేక్ చేసిన నిఖిల్ ఆ సినిమా ఘోరమైన ఫలితాన్ని ఇచ్చింది. అయితే కిర్రాక్ పార్టీ పోయాక కూడా నిఖిల్ మల్లి తమిళ హిట్ రీమేక్ నే నమ్ముకుని ముద్ర అంటూ సినిమా చెయ్యడం అది కాస్తా అర్జున్ సురవరం గా ప్రేక్షకులముందు కు రావడానికి నానా కష్టాలు పడింది. సినిమా విడుదలకు బోలెడంత సమయం తీసుకోవడంతో.. నిర్మాతలకు తలకు మించిన భారం అవడంతో నిఖిల్ కూడా ఆసినిమా వలన ఇబ్బందులు పడ్డాడు. పోనీ విడుదలయ్యాక ప్లాప్ టాక్ పడింది.

రీసెంట్ గా విదూడలైన అర్జున్ సురవరం సినిమాకి ప్లాప్ టాక్ తోనే మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ప్రస్తుతం వరకు కలెక్షన్స్ పరంగా ఓకే.. కానీ చివరిగా అర్జున్ సురవరం కలెక్షన్స్ తో నిర్మాతలు సేఫ్ అవుతారో.. లేదో తెలియాల్సి ఉంది. అయితే వరసగా రెండు రీమేక్స్ చేసి దెబ్బతిన్న నిఖిల్ మాత్రం ఈసారి రీమేక్స్ జోలికి పోను అంటున్నాడు. ఎందుకంటే తాను బేసిక్ గా రీమేక్స్ కి వ్యతిరేకమని చెబుతున్నాడు. అందుకే ఇకనుండి తన పాలసీకి వ్యతిరేఖంగా రీమేక్ చెయ్యనని చెప్పేస్తున్నాడు.

Tags:    

Similar News