నిఖిల్ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమాకి అస్సలు కాలం కలిసే రావడం లేదు. గత ఏడాదేప్పుడో విడుదలకావల్సిన అర్జున్ సురవరం.. డేట్స్ మార్చుకుంటూ మార్చుకుంటూ పోతుంది. సంక్రాతి [more]

Update: 2019-04-28 04:53 GMT

నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమాకి అస్సలు కాలం కలిసే రావడం లేదు. గత ఏడాదేప్పుడో విడుదలకావల్సిన అర్జున్ సురవరం.. డేట్స్ మార్చుకుంటూ మార్చుకుంటూ పోతుంది. సంక్రాతి సీజన్ లో విడుదల చేద్దామంటే పెద్ద సినిమాల జోరుకు తట్టుకోలేమని తప్పుకుంటే.. ఫిబ్రవరిలో ముద్ర టైటిల్ మీద నానా రచ్చ నడిచింది. ఇక ఏప్రిల్ అన్నారు.. చివరికి మే 1 న ముహూర్తం ఖరారు చేసుకుని… ప్రమోషన్స్ కూడా నిఖిల్ అండ్ టీం వెరైటీగా మొదలెట్టేసింది. అర్జున్ సురవరం మూవీ పై ప్రేక్షకుల్లో తన వెరైటీ ప్రమోషన్స్ తో మంచి ఆసక్తిని క్రియేట్ చేసాడు నిఖిల్. ఇక మే 1 న పక్కాగా అర్జున్ సురవరం వస్తుంది అనుకుంటే.. రీసెంట్ గా అది కూడా పోస్ట్ పోన్ అయ్యింది. ఎందుకంటే గత శుక్రవారం విడుదలైన అవెంజర్స్ ఎండ్ గేమ్ ధాటికి తట్టుకోలేమని భయపడి నిఖిల్ అర్జున్ సురవరాన్ని పోస్ట్ పోన్ చేసాడు.

అలా పోస్ట్ పోన్ అయిన అర్జున్ సురవరం మే మూడో వారంలో విడుదలవ్వొచ్చనే న్యూస్ మొదల్య్యింది. అయితే నిఖిల్ అలా పోస్ట్ ఫోన్ చెయ్యడం నిజంగా తెలివైన పనే. ఎందుకంటే ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా అవెంజర్స్ ఎండ్ గేమ్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. ఈ వీకెండ్ లోనే కాదు… ఈ వారంలో అవెంజర్స్ కి ఎవరు ఎదురెళ్ళినా…. మట్టిగొట్టుకుపోవడం ఖాయం. ఇప్పటికి అవెంజర్స్ టికెట్స్ బుకింగ్ కళకళలాడుతుంది. ఆ సినిమా టికెట్స్ సెకనుకు 18 నుండి 20 టికెట్స్ తెగుతున్నాయి అంటే.. ఆ సినిమా క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధమవుతుంది. మరి నిజంగా నిఖిల్ తన సినిమాని ద ఎండ్ గేమ్ సునామీలో కొట్టుకుపోకుండా పోస్ట్ పోన్ చేసి మంచి పనే చేసాడు. ఇక నిఖిల్ మాత్రమే కాదు… ప్రభుదేవా తమన్నాల అభినేత్రి 2 కూడా అవెంజర్స్ ఎండ్ గేమ్ సునామీకి భయపడి పోస్ట్ పోన్ చేసేసారు.

Tags:    

Similar News