మెగా డాటర్ పెళ్లికూతురు గెటప్!!

మెగా డాటర్ నిహారిక చాలా తొందరలో పెళ్లి పీటలెక్కబోతుంది. నాగబాబు తన కూతురు నిహారికాని గుంటూరు కుర్రాడు చైతన్య కిచ్చి పెళ్లి చేసే ఏర్పాట్లలో ఉన్నాడు. డిసెంబర్ [more]

Update: 2020-10-24 05:34 GMT

మెగా డాటర్ నిహారిక చాలా తొందరలో పెళ్లి పీటలెక్కబోతుంది. నాగబాబు తన కూతురు నిహారికాని గుంటూరు కుర్రాడు చైతన్య కిచ్చి పెళ్లి చేసే ఏర్పాట్లలో ఉన్నాడు. డిసెంబర్ లో జరగబోయే నిహారిక పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఉండబోతున్నట్లు .. పెళ్లి పనులను నిహారిక అన్నగారు వరుణ్ తేజ్ చూసుకుంటున్నట్లుగా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేస్ కూడా త్వరలోనే సెలెక్ట్ చేయబోతున్నట్లుగా నాగబాబు చెప్పాడు. అయితే నిహారిక పెళ్లి అన్నప్పటి నుండి నిహారిక ఫేస్ కి పెళ్లి కల వచ్చేసింది. సోషల్ మీడియాలో నిహారిక ఈ మధ్యన పెళ్లి బట్టలు ట్రైల్స్ లో కనిపిస్తుంది. మొన్నామధ్యన పెళ్లి కూతురు గెటప్ లో మంచి డిజైనర్ వెర్ డ్రెస్ ను ఓ షో రూమ్ కోసం వేసుకోగా.. తాజాగా నిహారిక మరో పెళ్లి కూతురు గెటప్ బయటికి వచ్చింది.

రేపు దసరా కి జీ ఛానల్ లో ప్రసారం కాబోయే చి ల సౌ శ్రీముఖి ప్రోగ్రాం లో తళుక్కున మెరిసిన నిహారిక.. ఇప్పుడు మరో పెళ్లి కూతురు గెటప్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. యువరాణిలా, ఏంజిల్ లా నిహారిక తల మీద ఆభరణాలతో, మెడ నిండా గొలుసులతో కళకళకలాడుతూ తెగ నవ్వేస్తుంది. ఆ ఫోటో చూసిన ఎవరైనా  నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో ఉందని, వెడ్డింగ్ డ్రెస్ ట్రైల్స్ లో ఉందని అనేస్తారు. మరి ఏంజిల్ లా మెరిసిపోతున్న మెగా పెళ్లి కూతురు నిహారిక పిక్ ని మీరు లుక్కెయ్యండి.

Tags:    

Similar News