పెళ్లి కూతురిలా ఉంది కానీ.. పెళ్లి కోసం కాదా?

మెగా డాటర్ నిహారిక అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది. జొన్నలగడ్డ చైతన్య తో నిశ్చితార్ధం చేసుకున్న నిహారిక ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలెక్కుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. [more]

Update: 2020-10-17 06:23 GMT

మెగా డాటర్ నిహారిక అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది. జొన్నలగడ్డ చైతన్య తో నిశ్చితార్ధం చేసుకున్న నిహారిక ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలెక్కుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకా ముహుర్తాలు పెట్టినట్లుగా అనిపించడం లేదు. కారణం నాగబాబు నిహారిక పెళ్లి ముచ్చట్లు బయటికి రానివ్వడం లేదు. అయితే నిహారిక ఈ మధ్యన జిమ్ లో ఎక్కువగా దర్శనమిస్తుంది. కరోనా కారణముగా ఇంట్లోనే ఉంటున్న నిహారిక కాస్త ఒళ్ళు చెయ్యడంతో కాబోయే భర్త చైతన్య తనతో పాటుగా జిమ్ కి తీసుకెళుతున్నాడు అనుకునేలా వాళ్లిద్దరూ కలిసి జిమ్ కి వెళ్లిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే తాజాగా నిహారిక పెళ్లి కూతురు గెటప్ లాంటి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఫొటోలో అచ్చం పెళ్లి కూతురు మాదిరి నిహారిక నగలు, పెళ్లి డ్రెస్ తో నిగనిగలాడుతోంది. కానీ నిహారిక ఆ పెళ్లి వేషం మాత్రం తన పెళ్లి కోసం కాదు. ఓ ప్రముఖ డిజైర్ షో రూమ్ కోసం నిహారిక ఈ పెళ్లి కూతురు గెటప్ వేసింది. నిహారిక ప్రోమోట్ చేసిన డ్రెస్ మాంగత్రాయ్ డిజైనర్ డ్రెస్ అని, హెయిర్ స్టైలిస్ట్ దగ్గరనుండి మేకప్ వరకు, అలాగే పిక్ క్రెడిట్ వరకు నిహారిక తన సోషల్ మీడియా పేజీ లో తన పిక్ తో పాటుగా వివరంగా పోస్ట్ చేసింది. మరి సన్నగా అచ్చం టాప్ హీరోయిన్ మాదిరి నిహారిక పెళ్లి కూతురు గెటప్, అలాగే ఆమె ఇచ్చిన ఫోజ్ చూస్తే అబ్బా నిహారిక ఎంతందంగా ఉందో.. నిజంగా ఈ డ్రెస్ లో పెళ్లి కళ వచ్చేసింది అనేస్తారు. మరి నిహారిక జస్ట్ డిజైనర్ డ్రెస్ కోసమే ఇలా తయారైతే.. పెళ్లి కోసం ఇంకెంతందంగా రెడీ అవుతుందో చూద్దాం.

Tags:    

Similar News