నిహారిక పెళ్లి.. ఇప్పుడిదే హాట్ టాపిక్!

మెగా ఫ్యామిలిలో ఎం జరుగుతుందా? పవన్- చిరు మధ్యన ఏం జరిగింది, పవన్ ఎందుకు మెగా ఫ్యామిలీతో కలవడం లేదు, మెగా ఫ్యామిలిలో ఎక్కడ ఎలాంటి చీలికలు [more]

Update: 2020-12-13 16:04 GMT

మెగా ఫ్యామిలిలో ఎం జరుగుతుందా? పవన్- చిరు మధ్యన ఏం జరిగింది, పవన్ ఎందుకు మెగా ఫ్యామిలీతో కలవడం లేదు, మెగా ఫ్యామిలిలో ఎక్కడ ఎలాంటి చీలికలు వస్తాయి, అల్లు అర్జున్ వేరు కుంపటి.. అబ్బో ఇలాంటి న్యూస్ లు మెగా ఫ్యామిలీ విషయంలో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. తాజాగా మెగా ఫ్యామిలీ మొత్తం నిహారిక పెళ్లి వేడుకల్లో మునిగిపోయింది. మెగా ఫ్యామిలి చిరు, నాగబాబు, పవన్ అందరూ కలిసి నిహారిక చైతన్య చేతిలో పెట్టి ఆనందించారు. పవన్ అయితే తన కొడుకు ఆద్య, అకీరాలతో నిహారిక పెళ్ళికి ఒక్కరోజు ముందే వెళ్లి అన్ని ఫంక్షన్స్ లోను సందడి చేసాడు. మరి అదే ఆనందంతో స్పెషల్ ఫ్లైట్స్ లో హైదరాబాద్ కి చేరుకున్నాయి మెగా ఫామిలీస్ అన్ని. 

మరి అంతా సాఫీగా జరిగితే ఎలా.. నిహారిక పెళ్ళికి అందరూ వచ్చారు కానీ.. పవన్ మూడో భార్య అన్నా లేజ్నోవా ఎక్కడా? చిరు తల్లి గారు నిహారిక పెళ్ళికి ఎందుకు రాలేదు? కేవలం రేణు కి పుట్టిన ఆద్య, అకీరా లు తప్ప అంటూ మొదలెట్టేసారు. పవన్ తో తన భార్య నిహారిక పెళ్ళికి వెళ్లకపోవడానికి కారణాల గురించి ఆరాలు మొదలయ్యాయి. చిరు చిన్న కూతురు శ్రీజ పెళ్ళిలో తెగ హడావిడి చేసిన అన్నా లేజ్నోవా నిహారిక పెళ్ళికి డుమ్మా కొట్టడానికి కారణాలు అంతుబట్టక అందరి బుర్రలు వేడెక్కిపోతున్నాయి. అసలు అన్నా ఇండియాలోనే ఉందా? ఉంటే పెళ్లికి ఎందుకు వెళ్ళలేదు? లేదా క్రిష్ట్మస్ వేడుకలకు స్వదేశానికి వెళ్లిందా? అనే అనుమానము.. అబ్బో నిహారిక పెళ్ళిలో పవన్ మూడో భార్య మిస్ అవడానికి, చిరు తల్లికనబడకపోవడానికి రకరకాల కారణాలు వెతుకుతున్నారు జనాలు.

కానీ వాళ్లిద్దరూ పెళ్ళిలో కనబడకపోవడానికి కరోనా అంటున్నారు మెగా ఫాన్స్. పవన్ కొడుకు చిన్నవాడు కావడంతోనే అన్నా నిహారిక పెళ్లికీర్ రాలేదని, పవన్ తల్లి వయసు మళ్లినవారు కావడంతోనే ఆమెని పెళ్ళికి తీసుకురాలేదని అంటున్నారు ఫాన్స్. కానీ మిగతా వాళ్ళకి అది ఎక్కదు, ఎందుకో ఏమిటో అనే క్యూరియాసిటిలో ఉన్నారు. 

Tags:    

Similar News