ప్రొడ్యూసర్ గా మారుతున్న సినిమాటోగ్రాఫర్

Update: 2018-06-18 08:03 GMT

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ "కంచె", "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు", నందమూరి బాలకృష్ణ "గౌతమిపుత్ర శాతకర్ణి" వంటి విజయవంతమైన చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేశారు. మొదటిసారి జ్ఞాన శేఖర్ సినిమా నిర్మాణం వైపు అడుగుపెడుతున్నారు. ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న మొదటి సినిమా ప్రారంభోత్సవ వేడుకకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డైరెక్టర్ క్రిష్, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావ్, నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయి బాబు ముఖ్య అథితులుగా పాల్గొన్నారు. వరుణ్ తేజ్ క్లాప్ కొట్టగా, తొలి షార్ట్ కు క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. పద్మారావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ముఖ్య పాత్రల్లో హీరోయిన్లు...

శ్రియ శరణ్ , నీహారిక కొణిదెల ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. కమర్షియల్ అంశాలతో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సుజనా దర్శకత్వం వహిస్తున్నారు. జ్ఞాన శేఖర్ ఈ చిత్రాన్ని రమేష్ కరుతూరితో కలిసి సంయుక్తంగా క్రియా ఫిలిం కార్పొరేషన్ మరియు కాళీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.

Similar News