పెళ్లికళ వచ్చేసిందే బాలా?

మెగా డాటర్ నిహారిక కొణెదల త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది. హీరోయిన్ గా కెరీర్ ని పరుగులుపెట్టిద్దామనుకున్న నిహారికకు నాగబాబు పెళ్లితో షాకిచ్చాడు. సోషల్ మీడియాలో హాట్ గ్లామర్ [more]

Update: 2020-07-24 08:28 GMT

మెగా డాటర్ నిహారిక కొణెదల త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది. హీరోయిన్ గా కెరీర్ ని పరుగులుపెట్టిద్దామనుకున్న నిహారికకు నాగబాబు పెళ్లితో షాకిచ్చాడు. సోషల్ మీడియాలో హాట్ గ్లామర్ ఫోజుల్తో కిర్రెక్కించిన మెగా డాటర్ గుంటూరు కుర్రాడు చైతన్యని పెళ్లి చేసుకోబోతుంది. హైదరాబాద్ మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద పొజిషన్ లో ఉన్న చైతన్య జొన్నలగడ్డను నిహారిక వివాహం చేసుకోబోతుంది. అయితే సోషల్ మీడియాలో నిన్నటివరకు నిహారిక పోస్ట్ చేసిన ఫొటోస్ ఒక ఎత్తైతే.. ఇప్పుడు తాజాగా పోస్ట్ చేసిన ఫోటో ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది.

రెడ్ హాట్ ఫ్రాక్ లో నిహారిక నవ్వుతూ కూర్చున్న ఫోటో చూస్తుంటే.. నిహారికకు పెళ్లి కళ వచ్చేసిందే బాలా అనాలనిపిస్తుంది. ఉయ్యాలలో కూర్చుని.. లూజ్ హెయిర్ తో నవ్వుతూ ఉన్న నిహారికకు పెళ్లి కల కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. మరి మెగా డాటర్ నిహారిక అలా ఫోటో పెట్టిందో లేదో ఇలా మెగా ఫాన్స్ లీక్ ల మీద లీక్ లతో హోరెత్తిస్తున్నారు. మరి నిహారిక వివాహం కరోనా తగ్గాక చేస్తారో.. తగ్గకుండానే కుటుంబ సభ్యుల మధ్యన చేస్తారో కానీ… నాగబాబు మాత్రం మా ఇంట్లో పెళ్లి ఇది. పబ్లిక్ ఫంక్షన్ కాదు అంటూ చిందులు వేస్తున్నాడు. మరి నిహారిక నిన్నటివరకు పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు ఫాన్స్ కి ఆ మాత్రం ఉత్సాహం ఉంటుంది. అందులోనూ మెగా డాటర్ ఆయే. ఖచ్చితంగా మెగా ఫాన్స్ పెళ్ళికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటుంటారు. కానీ నాగబాబు మాత్రం…ఇలా అంటున్నాడు.

Tags:    

Similar News