బోయపిల్లకి సైరా నరసింహారెడ్డి అండ

Update: 2018-12-16 10:13 GMT

మెగా హీరో చిరంజీవి సై రా నరసింహారెడ్డి చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. ఈ సినిమాని రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమాలో నటించే నటీనటులు అంతా పలు భాషలకు చెందిన హేమ హేమీలు. అలాగే ఈసినిమాలో చిన్న పాత్ర కోసం నటీనటులంతా పరితపిస్తుంటే.. మెగా హీరోయిన్ నిహారిక కి ఈ సినిమా లో చోటు దక్కింది. హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపట్టిన నిహారిక చిరు తో ఉన్న అనుబంధం కారణంగా సై రా లో ఒక పాత్ర కోసం నిర్మాత అన్న అయిన చరణ్ ని కలవగా చరణ్ కూడా ఒకే అనేసి నిహారిక కోసం సై రాలో ఒక పాత్ర ఇచ్చేశాడట.

అయితే సినిమాలో నిహారిక కోసం సురేందర్ రెడ్డి ఒక ప్రత్యేక పాత్రని డిజైన్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇక హ్యాపీ వెడ్డింగ్ ప్రమోషన్స్ లో నిహారిక సై రా నరసింహ రెడ్డి లో తనది బోయపిల్ల పాత్ర అని.. సినిమాలో కొన్ని నిముషాలు ఉండే కేరెక్టర్ అని చెప్పడమే కాదు... సై రాలో కొన్ని సెకండ్ కనబడినా జన్మ ధన్యం అన్నట్లుగా మాట్లాడింది. అయితే ఈ సినిమాలో నిహారిక వేసే బోయపిల్ల కేరెక్టర్ కు పెళ్లైన వెంటనే తన భర్తను ఓ బ్రిటీష్ దొర వలన కోల్పోతుంది. దాంతో ఆమె తిరగబడుతుంది. ఆమెకు నరసింహారెడ్డి సపోర్ట్ గా నిలుస్తాడని సమాచారం. ఆ పాత్రపై సానుభూతి కలుగుతుందని, ఆ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని భావిస్తోంది టీమ్.

ఆమితాబచ్చన్‌, నయనతార, జగపతిబాబు, విజయ్‌సేతుపతి, రవికిషన్‌, సుదీప్‌, తమన్నా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో అయినా... లేదంటే దసర కయినా విడుదల చేసే ప్లాన్ లో సై రా బృందం ఉంది.

Similar News