ఆ హీరోతో నాకు పెళ్లేంటి..?

ఇండస్ట్రీలో ఒక హీరోతో మరో హీరోయిన్ కి పెళ్లి, ప్రేమ అంటూ చాలానే వార్తలు, గాసిప్స్ సోషల్ మీడియాలో, ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంటాయి. అయితే అందులో [more]

Update: 2019-03-27 07:28 GMT

ఇండస్ట్రీలో ఒక హీరోతో మరో హీరోయిన్ కి పెళ్లి, ప్రేమ అంటూ చాలానే వార్తలు, గాసిప్స్ సోషల్ మీడియాలో, ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంటాయి. అయితే అందులో చాలావరకు రూమర్స్ ఉంటాయి. ఎప్పుడో ఒకటి మాత్రమే నిజమవుతుంటాయి. అందులో చైతు – సామ్ లాంటి వాళ్లు ఉంటారు. ఇక రూమర్స్ విషయానికొస్తే… చైతు – అనుష్క పెళ్లికి నాగ్ గ్రీన్ సిగ్నల్ లాంటి వార్తలు రూమర్స్ అన్నమాట. తాజాగా ఇలాంటి రూమర్ టాలీవుడ్ సర్కిల్స్ లో తెగ హల్ చల్ చేసింది. అదేమిటంటే మెగా డాటర్ నిహారిక స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారు.. త్వరలోనే ఈ ఇద్దరి వివాహం అంటూ కొన్ని వార్తలు ఈ మధ్యన ఫిలిం సర్కిల్స్ లో, సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

విజయ్ దేవరకొండతో పెళ్లి అని…

ప్రస్తుతం సూర్యకాంతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నిహారిక మీద గతంలోనూ ఈ పెళ్లి రూమర్స్ వినబడ్డాయి. ఒక మనసు సినిమాలో కలిసి నటించిన నాగశౌర్యకి, నిహారికకు పెళ్లి అని ప్రచారం జరగగా అవన్నీ రూమర్స్ అని శౌర్య ఎప్పుడో కొట్టిపడేసారు. తాజాగా విజయ్ దేవరకొండ వంతు వచ్చింది. విజయ్ దేవరకొండతో నిహారిక పెళ్లి అంటూ వార్తలు రావడం, సూర్యకాంతం ఈవెంట్ కి వచ్చిన విజయ్ దేవరకొండ అలాంటిదేం లేదంటూ హుందాగా చెప్పడం ఆ ఈవెంట్ స్టేజ్ మీదే చూసాం. అయితే ఆ ఈవెంట్ లోనే నిహారిక.. విజయ్ తో తన పెళ్లి విషయమై స్పందిద్దామని అనుకుందట. కానీ అది మంచి పని కాదని ఆగిందట.

నాకు పరిచయమే లేదు

తాజాగా సూర్యకాంతం ప్రమోషన్స్ లో నిహారిక.. విజయ్ తో పెళ్లి విషయమై స్పందించింది. తనకు, విజయ్ కి అసలు పరిచయమే లేదని.. సూర్యకాంతం ఈవెంట్ లోనే మొదటిసారి విజయ్ దేవరకొండతో పరిచయం అయ్యిందని.. ఒక్కసారి కూడా కలవని హీరోతో పెళ్లి అని ఎలా పుకార్లు పుట్టిస్తారని అంటుంది. అలాగే విజయ్ దేవరకొండ తనని చెల్లెలిగా ట్రీట్ చెయ్యడం బాగుందని, తనకి ఎలాంటి అబ్యంతరం లేదని చెబుతోంది. విజయ్ తో పెళ్లి అనేది కేవలం రూమర్ అని కొట్టిపారేసింది.

Tags:    

Similar News