సూర్యకాంతాన్ని ఊహించుకోండిలా..!

Update: 2018-12-18 07:47 GMT

పాత సినిమాల్లో స్టార్ హీరోలైన ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ లాంటి హీరోలకు ఎంత పేరుందో... గయ్యాళి సూర్యకాంతంకి అంతే పేరొచ్చింది. పాత తరం ప్రేక్షకులకు సూర్యకాంతం అంతే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. ఆమె ఏ సినిమాలో చేసినr గయ్యాళి అత్తగానో.. అమ్మగానో.. అక్కగానో ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసేది. మరి అలాంటి పేరుతో మెగా డాటర్ నిహారిక ఒక సినిమాలో నటిస్తుంది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ సినిమాల్లో హీరోయిన్ గా అదృష్టం పరిక్షించుకున్న నిహారికకు రెండు సినిమాలు ఒకే రకమైన ఫలితాలను ఇచ్చాయి. ఇక తాజాగా ప్రణీత్ దర్శకుడిగా రాహుల్ విజయ్ తో కలిసి సూర్యకాంతం సినిమాలో నిహారిక నటించింది.

రెండు రకాల షేడ్స్ లో నిహారిక

సూర్యకాంతం నిహారిక ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఆసక్తికరమైన టైటిల్ తో .. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నిహారిక, రాహుల్ విజయ్ లు రెండు రకాల షేడ్స్ లో కనిపిస్తున్నారు. ఒక షేడ్ లో నిహారికని రాహుల్ విజయ్ ఎత్తుకోగా... నిహారిక ఎంతో ప్రేమగా రాహుల్ ని చూస్తుంటే.. మరో షేడ్ లో నిహారిక రాహుల్ ని గయ్యాళి గంప సూర్యకాంతంగా రాచి రంపాన పెడుతుంది. మరి రాహుల్ పేస్ పై దెబ్బలు అన్ని చూస్తుంటే సూర్యకాంతంగా నిహారిక రెచ్చిపోయి మరీ లవర్ కమ్ భర్త ని హింసిస్తున్నట్లు కనిపిస్తోంది.

Similar News