ప్రభాస్ నెక్స్ట్ మూవీ అప్డేట్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తరువాత ప్రభాస్ యంగ్ డైరెక్టర్ [more]

Update: 2020-05-19 04:29 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తరువాత ప్రభాస్ యంగ్ డైరెక్టర్ నాగ అశ్విన్ డైరెక్షన్లో లో ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో మన ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమా గురించి అశ్విన్ లేటెస్ట్ గా ఓ అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ మరియు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, అయితే కరోనా కారణంగా కొన్ని పనులు లేట్ అయ్యాయి..త్వరలోనే అవి కూడా అయిపోతాయి.

ఇక ఈమూవీలో కీలక పాత్రల కోసం క్యాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. ఈమూవీ లో ఎవరిని తీసుకోవాలో అని ఐడియా ఉందని కానీ అప్పుడే ఓకే చేయడంలేదని ట్వీట్ చేసాడు అశ్విన్. బాలీవుడ్ లో కొంతమంది నటీనటుల్ని తీసుకోవాలని అశ్విన్ భావిస్తున్నాడు. ఇక ఈమూవీని ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఎక్కడ కంప్రమైజ్ కాకుండా రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.

Tags:    

Similar News