ఇది మరీ ఘోరం సుమీ..

Update: 2018-11-04 09:22 GMT

ఈ మధ్యన సినిమాలు 50 రోజులు, 100 రోజులు పూర్తి చేసుకునే రోజులు పోయాయి. ఎక్కడో ఒకటి అర మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతూ 50 నుండి 100 రోజులు పూర్తి చేసుకుంటున్నాయి. అలాంటి సినిమాలు వేళ్ళమీద లెక్కెట్టుగా ఉన్నాయి. అయితే తమ సినిమాలు హిట్ సంగతి పక్కనపెట్టేసి దర్శక నిర్మాతలు సినిమాలని శాటిలైట్స్ రైట్స్, డిజిటల్ రైట్స్ అంటూ పెద్ద మొత్తంలో అమ్మెయ్యడం.. సినిమా టాక్ తో సంబంధం లేకుండా.. థియేటర్స్ లో సినిమాలు ఉండగానే ఆ సినిమాలను బుల్లితెర మీద, అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి డిజిటల్ మీడియాలో సినిమాలను వేసేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.

అలా ఈ మధ్యన రామ్ చరణ్ రంగస్థలం విషయంలో జరిగింది. రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే సినిమా 50 రోజులు పూర్తి కాగానే అమెజాన్ ప్రైమ్ వీడియో లో పెట్టేసారు. ఇంకా థియేటర్స్ లో షేర్ కొల్లగొడుతున్న మూవీ ని అలా అమెజాన్ లో వేసేసారు. వారు నిర్మాతలతో అమెజాన్ వారు కుదుర్చుకున్న ఒప్పందం అలాంటిది. ఇక తాజాగా తమిళనాట ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. అదేమిటంటే... త్రిష - విజయ్ సేతుపతి జంటగా వచ్చిన 96 సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. విడుదలై కేవలం కొద్ది రోజులే అయ్యింది. అయితే ఆ సినిమా మీద టాలీవుడ్ లో దిల్ రాజు మనసుపడి ఆ సినిమా హక్కులు దక్కించుకున్నాడనే ఉంది.

ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా 96 చిత్రం థియేటర్లలో నడుస్తుంటే... ఇప్పుడు దీపావళి సందర్భంగా ఆ సినిమాని ఒక ఛానల్ వాళ్ళు ప్రసారం చేస్తున్నారనే న్యూస్ కోలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఛానల్ 96 సినిమాని దివాళి సందర్భంగా తమ ఛానల్లో వేస్తున్నామని పబ్లిసిటీ చేస్తున్న విషయం 96 హీరోయిన్ త్రిష దాక వెళ్లడంతో.. ఇప్పటికీ 80 శాతం థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తున్నారు. అలాంటప్పుడు ఇంత త్వరగా సినిమా ప్రీమియర్‌ షో వేయడం సబబు కాదు. సంక్రాంతికి ప్రీమియర్‌ షో వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.. అంటూ తన మనసులోని మాటను ట్వీట్ చేసింది. ఇక ఈ విషయంలో 96 డైరెక్టర్ కూడా మండిపడుతున్నాడు. మరి శాటిలైట్ హక్కులను భారీ మొత్తానికి కొనేసి ఇలా థియేటర్స్ లో సినిమా ఉండగానే బుల్లితెర మీద వేస్తె ఆ సినిమా కొన్న బయ్యర్స్ పరిస్థితి ఏమిటో కదా...

Similar News