ఓవర్సీస్ లో బాలయ్యకు ఒక్కసారిగా పెరిగిన క్రేజ్..!

Update: 2018-09-14 07:21 GMT

బాలకృష్ణ - క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ పాత్రధారిగా దర్శనమిస్తుంటే.. తాజాగా ఆ సినిమా లో మరో కీరోల్ చంద్రబాబు పాత్రధారి రానా లుక్ కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. రానా అచ్చం చంద్రబాబు పోలికలతో ఇరగదీస్తున్నాడు. దీన్నిబట్టే దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ పాత్రలను ఎలా తీర్చిద్దుతున్నాడో తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ మీద కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ భారీ అంచనాలే ఉన్నాయి.

భారీ ధరలకు ఓవర్ సీస్ రైట్స్

అక్కడ ఎన్టీఆర్ బయోపిక్ కి పలుకుతున్న ధరను బట్టి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. గతంలో బాలయ్య బాబు సినిమాలకు ఎన్నడూ ఓవర్సీస్ లో ఎన్టీఆర్ బయోపిక్ కి ఉన్న క్రేజ్ లేదు. అందుకే అక్కడ ఆ సినిమాలకు పెద్దగా ధర పలికేది కాదు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ మీదున్న అంచనాలతో ఓవర్సీస్ లో ఇప్పుడు దాదాపుగా 20 కోట్ల ఆఫర్ వచ్చినట్టుగా సమాచారం. మరి ఇలాంటి ఆఫర్ ఎన్నడూ బాలకృష్ణ గత సినిమాలకు రాలేదంటే ఎన్టీఆర్ బయోపిక్ పై అంచనాలు క్రేజ్ ఏ లెవల్ ఉన్నాయో అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాతో బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయమనే సంకేతాలు వినవస్తున్నాయి.

Similar News