రియల్ లైఫ్ లో నయన్ సీఎం అవ్వబోతుంది!

Update: 2018-10-14 06:13 GMT

కోలీవుడ్ లో సెన్సేషన్ న్యూస్ ఏంటంటే దశాబ్దం కిందట ఓ జ్యోతిష్యుడు నయనతారకు ముఖ్యమంత్రి పదవీయోగం ఉందని చెప్పాడట. అలానే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ లు కూడా చెప్పాడట. పెళ్లి చేసుకోవద్దు అని..పెళ్లి చేసుకుంటే రోడ్డున పడతావ్ అని..పెళ్లి చేసుకోకుండా ఉంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందని ఆ జ్యోతిష్యుడు చెప్పాడట.

నందూ బయటపెట్టాడు.....

మరి ఇది నయన్ నమ్ముతుందో లేదో తెలియదు కానీ అది నిజమే అని డైరెక్టర్ నందు చెప్పుతున్నారు. ఈవిషయాన్ని నయన్ ఎక్కడ చెప్పలేదు కానీ డైరెక్టర్ నందు ఈ విషయాన్ని బయట పెట్టేసాడు. శింబు - నయన్ ప్రేమలో ఉన్నప్పుడు వారిద్దరూ ఓ జ్యోతిష్యుడు దగ్గరకు వెళ్లారని.. అప్పుడు అలా ఆ జ్యోతిష్యుడు చెప్పాడని నందు చెప్పాడు.

అందుకోసమేనా?

మరి ఈవిషయం ఆమె నమ్మిందో లేదో కానీ ప్రస్తుతం ఆమె అయితే అధికారికంగా అవివాహితగానే ఉంది. మరి నయన్ సీఎం ఎప్పుడు అవుతుందో! ఏమో గుర్రం ఎగరావచ్చు. కానీ ఇవ్వని ట్రాష్ అని కొంత మంది అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

Similar News