`కో ..కో ..కోకిల‌` అంటోన్న నయనతార

Update: 2018-08-24 07:28 GMT

న‌య‌న‌తార టైటిల్ పాత్ర‌ధారిగా నెల్సన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన చిత్రం 'కో..కో..కోకిల‌'. ఇటీవ‌ల త‌మిళంలో 'కోల‌మావు కోకిల‌' పేరుతో విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ టాక్‌తో.. అద్వితీయ‌మైన క‌లెక్ష‌న్స్‌ తో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'కో..కో..కోకిల‌' పేరుతో ఆగ‌స్ట్ 31న విడుద‌ల చేస్తున్నారు. ఓ సాధార‌ణ‌మైన అమ్మాయి.. ఓ స్మ‌గ్లింగ్ గ్యాంగ్ చేతిలో అనుకోకుండా చిక్కుకుపోతుంది. అటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల నుండి ఆమె ఎలా బ‌య‌ట‌ప‌డింద‌నే పాయింట్‌ పై డైరెక్ట‌ర్ నెల్స‌న్ ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు.

తారాగణం, సాంకేతిక నిపుణులు...

న‌య‌న‌తార, యోగిబాబు, శ‌ర‌ణ్య పొన్‌వ‌న్న‌న్ తారాగ‌ణంగా న‌టించిన ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌, కెమెరా: శివ‌కుమార్ విజ‌య‌న్‌, నిర్మాణం: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, ద‌ర్శ‌క‌త్వం: నెల్స‌న్‌.

Similar News