దర్శకుడితో నయనతార నిశ్చితార్ధం..?

కోలీవుడ్ లో ప్రస్తుతం చర్చంతా నయనతార, విఘ్నేష్ శివన్ జంట గురించే. వీరు దాదాపు మూడేళ్ల నుండి ప్రేమించుకుంటున్నారు. బహిరంగంగానే తిరుగుతున్నారు. కోలీవుడ్ లో ఏ ఈవెంట్ [more]

Update: 2019-04-29 07:57 GMT

కోలీవుడ్ లో ప్రస్తుతం చర్చంతా నయనతార, విఘ్నేష్ శివన్ జంట గురించే. వీరు దాదాపు మూడేళ్ల నుండి ప్రేమించుకుంటున్నారు. బహిరంగంగానే తిరుగుతున్నారు. కోలీవుడ్ లో ఏ ఈవెంట్ కి వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్లడం, సోషల్ మీడియా లో వీరిద్దరు కలిసి దిగిన ఫొటోస్ పెట్టడం లాంటివి చేసి తమ ఫ్యాన్స్ కి బాగా దగ్గరగా ఉన్నారు. అయితే వీరు మీడియా ముందు ఎప్పుడు కనిపించినా మీ పెళ్లి ఎప్పుడు అని ఆడితే మొహం చాటేసుకుని పెదవి విప్పకుండా వెళ్లిపోయేవారు. అటు విఘ్నేష్ కూడా పెళ్లిపై కచ్చితంగా ఏ విషయం చెప్పలేకపోయాడు. అయితే తాజాగా కోలీవుడ్ సమాచారం ప్రకారం ఈ జంట తమ పెళ్లిపై ఓ అవగాహనకు వచ్చిందట. ఈ ఏడాదిలోనే ఎంగేజ్ మెంట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఏ నెల అనేది మాత్రం అనుకోలేదట.

ముందు నిశ్చితార్థం…

డైరెక్టర్ విఘ్నేష్.. నయన్ ను ఎప్పటినుండో పెళ్లి చూసుకుందామని అడుగుతున్నాడట. కానీ నయన్ ఇప్పుడే పెళ్లి చేసుకుంటే సినిమా అవకాశాలు తగ్గిపోతాయని, ఇప్పుడొస్తున్న ఆదాయం పూర్తిగా పడిపోతుందనే భయంతో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉందని టాక్. కానీ చివరకు వీరు ఓ నిర్ణయానికి వచ్చి ఈ ఏడాది నిశ్చితార్థం చేసుకుని పెళ్లి గురించి తరువాత ఆలోచిద్దామని డిసైడ్ అయ్యారు. నిశ్చితార్థానికి, పెళ్లికి ఏడాది గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈలోపు నయన్ కమిట్ అయిన సినిమాలన్నీ కంప్లీట్ చేసుకోనుంది. అలానే విఘ్నేష్ కూడా తను డైరెక్ట్ చేయనున్న సినిమా కంప్లీట్ చేసుకోనున్నాడు.

Tags:    

Similar News