నయనతార ఆకాశమే హద్దుగా

Update: 2018-09-13 07:56 GMT

నయనతార కోలీవుడ్ లోను, టాలీవుడ్ లోను భారీ ప్రాజెక్టులలో నటిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. కోలీవుడ్ టాలీవుడ్లో భీభత్సమైన అవకాశాలున్నప్పుడే.. కొందరు హీరోయిన్స్ బాలీవుడ్ మీద కన్నేస్తారు. కానీ నయనతార మాత్రం కోలీవుడ్ ని టాలీవుడ్ ని ఏలుతూ స్టార్ హీరోల సరసన చేరిపోయి స్టార్ హీరోలతో సమానంగా సంపాదిస్తుంది. ఇప్పటికే మూడు కోట్ల పారితోషకం తీసుకుంటున్న నయనతారకు ఈ ఏడాది రెండు సినిమాలు వరసగా హిట్స్ అయ్యేసరికి తన పారితోషకాన్నిమరింతగా పెంచేసినట్లుగా కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈఏడాది ఆగష్టు లో విడుదలైన రెండు సినిమాలు నయనతార పొజిషన్ మరింతగా పెరిగేలా చేశాయి.

ఇప్పటికే లేడి ఓరియెంటెడ్ చిత్రాలతోను, స్టార్ హీరోల సినిమాల్తోనూ నయనతార చెలరేగి నటించడం... మరొక హీరోయిన్ కి గత కొన్నాళ్లుగా కోలీవుడ్ లో టాప్ లోకి రాకుండా చూసుకుంటూ.... ప్రస్తుతం బిగ్ స్టార్స్ సరసన బిగ్ ప్రోజెక్టులయిన 1000 కోట్ల ప్రాజెక్టుల్లో నటిస్తూ 1000 కోట్ల హీరోయిన్ గా నయనతార మరింది. మరి ఆగష్టు లో విడుదలైన కోలమవు కోకిల అనుకోకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవడం.. అలాగే ఆగష్టు చివరిలో విడుదలైన ఇమ్మైక నొడిగళ్ కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోవడంతో నయనతార తన రెమ్యునరేషన్ మరింతగా పెంచేసిందట. విఘ్నేష్ శివం తో ప్రేమ పెళ్లి అంటున్నప్పటికీ.. సినిమాలు చేసుకు పోతున్న ఈ లేడి సూపర్ స్టార్ రేంజ్ అలా పెరిగిపోయింది.

నయనతార తెలుగులో చిరు సరసన 200 కోట్ల ప్రాజెక్ట్ అయిన సై రా నరసింహారెడ్డిలోను, అజిత్ సరసన కోలీవుడ్ లో 100 కోట్ల ప్రాజెక్ట్ విశ్వాసం లోను, ఇక శంకర్ - కమల్ హాసన్ కాంబోలో రాబోతున్న బిగ్ ప్రాజెక్ట్ భారతీయుడు 2 ప్రాజెక్ట్ 500 కోట్లతో రూపుదిద్దుకోబోతున్న ఆ సినిమాలోనూ నయనతారే హీరోయిన్ కావడంతో.. ఈ సినిమాల్తో నయనతార ఇండియా వైడ్ గా పేరు సంపాదించుకుని.. తన పారితోషంతో దర్శకనిర్మాతలకు మరింత చుక్కలు చూపెట్టినా చూపెట్టొచ్చు. అయినా నయనతారకున్న డిమాండ్ మాత్రం ఎక్కడా డౌన్ అవడం లేదు.

Similar News