సైరా కోసం కాదా...?

Update: 2018-05-09 04:05 GMT

సౌతిండియన్ లేడి సూపర్ స్టార్ నయనతార తన లవర్ విఘ్నేష్ శివన్ తో కలిసి సమ్మర్ ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేసింది. తన లవర్ విగ్నేష్ శివన్ తో బర్త్ డే పార్టీలు, హాలిడే వెకేషన్స్ ని బాగానే ఎంజాయ్ చేస్తుంది కానీ... పెళ్లి పేరు మాత్రం ఎత్తకుండా సైలైన్స్ మైంటైన్ చేస్తున్నది ఈ ముదురు భామ. కోలీవుడ్ లో సూపర్ స్టార్ గా అత్యధిక పారితోషకం అందుకుంటున్న నయనతార లేడి ఓరియెంటెడ్ ఫిలిమ్స్ తో స్టార్ హీరోలకు సైతం గట్టి పోటీనిస్తుంది. ఇక ప్రస్తుతం తెలుగులోనూ సై రా వంటి బిగ్ ప్రాజెక్ట్ లో చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రస్తుతం సురేందర్ రెడ్డి సై రా రెండో షెడ్యూల్ ను చిత్రీకరిస్తున్నారు. అందులో నయనతార కి సంబందించిన సీన్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికే నయనతార తన పాత్రకు సంబందించిన సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కానీ నయనతార ఇంకా హైదరాబాద్ లోనే ఉంది. విగ్నేష్ శివన్ తో సమ్మర్ ట్రిప్ ముగించుకున్న నయనతార ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంది. కానీ ఆమె ఇక్కడ మకాం వేసింది మాత్రం సై రా కోసం కాదు. అయితే ఇక్కడెందుకుంది అంటే.. ప్రస్తుతం నయన్ నటిస్తున్న కోలీవుడ్ మూవీ విశ్వాసం సినిమా కోసమే నయనతార హైదరాబాద్ కి వచ్చింది. రామోజీ ఫిల్మ్‌సిటీతోపాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో దాదాపు నెలరోజులపాటు చిత్రీకరణ జరగనుంది. కాల్షీట్ల ప్రకారం నయన్ రెండువారాలపాటు హైదరాబాద్ లోనే వుండనుంది.

అజిత్ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న విశ్వాసం సినిమా కోసం నయన్ హైదరాబాద్ లో అడుగు పెట్టింది. అజిత్ పక్కన హీరోయిన్ గా నయనతార నటిస్తుంది. ఇక ఈ సినిమాని దర్శకుడు శివ దీపావళికి విడుదల చెయ్యాలని షూటింగ్ ని శరవేగంగా కానిచ్చేస్తున్నాడు. మరి అజిత్ - శివ కాంబోలో రాబోతున్న ఈ నాలుగో మూవీ పై ట్రేడ్ లోను కోలీవుడ్ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి.

Similar News