డాక్టర్ నయనతార?

Update: 2018-07-03 02:58 GMT

కుర్ర హీరోయిన్స్, అంటే స్టార్ హీరోయిన్స్ తో పోటీగా సినిమాలు చేసుకుపోతున్న నయనతార జోరుకు.... కొత్త హీరోయిన్స్ అంటే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న హీరోయిన్స్ కి మాత్రం చమటలు పడుతున్నాయి. లేడి ఓరియెంటెడ్ సినిమాలతోనే కాదు స్టార్ హీరోల సినిమాల్లోనూ హీరోయిన్ గా నటిస్తూ అదరగొట్టేస్తున్న నయనతార తెలుగులో చిరంజీవి పక్కన సై రా నరసింహారెడ్డి లో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో నయన్ రోల్ చాలా కీలకమంటున్నారు. అలాగే తమిళంలో స్టార్ హీరో అజిత్ తో నయనతార జోడీకడుతుంది. శివ - అజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ కాంబో విశ్వాసం సినిమా లో నయనతార హీరోయిన్.

అయితే ఈ సినిమాలో నయనతార పాత్ర ఎలా ఉండబోతుంది అనే దాని మీద అటు అజిత్ అభిమానుల్లోనూ, ఇటు నయనతార అభిమానుల్లోనే ఆసక్తి ఏర్పడింది. అయితే ఈ సినిమాలో నయనతార డాక్టర్ కేరెక్టర్ లో కనిపిస్తుందని కోలీవుడ్ టాక్. మరి డాక్టర్ గా చేసిన, మరేదన్న పాత్రలో చేసినా నయనతార తన పెరఫార్మెన్స్ తో పాటుగా గ్లామర్ పరంగాను అదరగొట్టేస్తుంది. అందుకే నయనతార ఇన్ని రోజులైనా ఇన్ని ఏళ్ళైనా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అలాగే ప్రియుడు విగ్నేష్ శివన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నా నయనతార అతన్ని ఎప్పుడు పెళ్లాడుతుందో మాత్రం చెప్పకుండా అందరిలో సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇకపోతే ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్ లోను, అభిమానుల్లోనూ భారీ అంచనాలున్నాయి.

ఇక అజిత్ అండ్ శివ ది హిట్ కాంబినేషన్ కావడంతోనే ఈ సినిమాకి ఇంత క్రేజ్ అంటున్నారు. అలాగే టాప్ హీరోయిన్ నయనతార హీరోయిన్ కావడంపై కూడా సినిమాపై అంచనాలు పెరిగాయనడానికి కారణమంటున్నారు. ఇకపోతే ఈ సినిమా అటు తమిళం తో పాటుగా తెలుగులోనూ ఒకే రోజు అంటే ఒకే డేట్ కి విడుదలకాబోతుంది.

Similar News