తమిళంలో హిట్.. తెలుగులో మాత్రం..!

Update: 2018-09-29 11:37 GMT

మణిరత్నం కొన్నాళ్లుగా ఫామ్ లో లేడు. ఆయన తీసిన చాలా చిత్రాలు వరసగా ఫెయిల్ అవుతున్నాయి. ఓకే బంగారంతో ఫామ్ లోకి వచ్చిన మణిరత్నం తర్వాత కూడా ప్లాప్ సినిమాలే చేసాడు. ఇక మణిరత్నం అవుట్ డేటెడ్ డైరెక్టర్ అయ్యాడని అనుకుని స్టార్ హీరోలెవరు ఆయనతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకే మణిరత్నం స్టార్ హీరోలెవరినీ నమ్ముకోకుండా తమిళంలో ఒక మాదిరి ఫామ్ లో ఉన్న వారిని నటీనటులుగా ఎంపిక చేసి... లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో చెక్క చివంత వానం అనే మల్టీస్టారర్ సినిమాని తెరకేక్కిన్చాడు. అరవింద్ స్వామి - జ్యోతిక - అదితి రావు, శింబు, విజయ్ సేతుపతి వంటి స్టార్ కాస్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు.

తమిళనాట వసూళ్ల

ఈ సినిమా గత గురువారం తమిళ ప్రేక్షకుల ముందుకు రాగా.. తెలుగులో ఒక మాదిరి ప్రమోషన్స్ తో నవాబ్ అనే టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తమిళంలో చెక్క చివంత వానంకి హిట్ టాక్ రావడమే కాదు.. గురువారం వర్కింగ్ డే అయినప్పటికీ అక్కడ తమిళనాడులో 8.05కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి విజయం దిశగా దూసుకుపోతుంది. మరి ఒక వర్కింగ్ డేలో సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడంతో.. ప్రేక్షకులే కాదు ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యాన్ని కలుగజేస్తోంది. అయితే తమిళనాట అదిరిపోయే హిట్ అయ్యే రేంజ్ లో కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న ఈ సినిమా తెలుగులో మాత్రం అంతంతమాత్రంగా కలెక్షన్స్ తెచ్చుకుంటుంది.

మంచి టాక్ రావడంతో...

గురువారం తెలుగులో నాగార్జున - నాని దేవదాస్ అనే మల్టీస్టారర్ నవాబ్ కి పోటీగా విడుదల అవడం.. ఆ సినిమాలో నాగ్ - నాని నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడం.. యావరేజ్ టాకొచ్చిన.... నాగ్, నాని క్రేజ్ తో సినిమా హిట్ దిశగా దూసుకుపోవడం... నవాబ్ సినిమాకి హిట్ టాకొచ్చి.. క్రిటిక్స్ కూడా సినిమా చాలా బావుంది.. మణి రత్నం ఈజ్ బ్యాక్ అంటున్నప్పటికీ .. నవాబ్ కలెక్షన్స్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఆశాజనకంగా లేవు. తొలిరోజు నవాబ్ పెద్దగా ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేదు. అయితే క్రిటిక్స్ ఇచ్చిన రివ్యూ రేటింగ్స్ తో నవాబ్ కి ఈ వీకెండ్ లో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు.

Similar News