నవాబ్ ఎవరు..?

Update: 2018-09-17 08:12 GMT

సినిమాల్లో హీరో రేంజ్ ఏంటో తెలియాలంటే ఆయన రేంజ్ తగ్గట్టుగానే విలన్ ఉండాలి. ఆ విలన్ హీరోతో అసలు ఎలా గొడవ పడతాడు అన్న విషయం స్క్రీన్ ప్లే రూపంలో చూపిస్తారు మన డైరెక్టర్స్. అయితే విలన్ అనేవాడు ఇంట్లోనే ఉంటే? అది కూడా సొంత అన్నదమ్ముల మధ్య ఉంటే? ఎలా ఉంటుందో డైరెక్టర్ మణిరత్నం లేటెస్ట్ గా తెరకెక్కించిన నవాబ్ చిత్రంలో చూపించనున్నాడు. ఇది అన్నదమ్ముల మధ్య కుర్చీ ఆట నేపథ్యంలో సాగుతున్న ఆసక్తికర ఫ్యామిలీ రివెంజ్ డ్రామా అని ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది. ఈ అన్నదమ్ములకి తండ్రిగా ప్రకాష్ రాజ్ నటించనున్నారు.

ఫ్యామిలీ డ్రామాగా...

ఇక ఈ మూవీ కాస్టింగ్ కూడా సినిమాకి పెద్ద ప్లస్ కానుంది. ముఖ్యంగా ఇందులో అరవింద స్వామి, విజయ్ సేతుపతి లాంటి క్రేజీ స్టార్స్ తో పాటు శింబు, జ్యోతిక నటిస్తున్నారు. అయితే వీరిలో నవాబ్ ఎవరు? అన్నది ఇప్పటికీ సస్పెన్స్. ఇక రీసెంట్ గా ఈ సినిమాలో ఒక సాంగ్ రిలీజ్ చేశారు. 'చెట్టు కొమ్మలలో గువ్వల జంట మనం.. గుండె సవ్వడిలో.. ' అంటూ సాగే ఆ సాంగ్ లో శింబు, అరవింద స్వామి, అరుణ్ సాయి లవర్స్ ని పరిచయం చేశారు. విజయ్ సేతుపతిని పెళ్లికి దూరంగా ఉండే కుర్రాడిగా చూపించారు. సో ఓవర్ అల్ గా ఇది ఒక ఫామిలీ డ్రామా అని అర్ధం అవుతుంది.

నెలాఖరులో విడుదలకు సిద్ధం...

మరి మణిరత్నం ఈ డ్రామాను ఎలా తీర్చిదిద్దారో తెలియాలంటే ఈ నెలాఖరు వరకు ఆగాల్సిందే. ఇక సినిమా ట్రైలర్ లో అరవింద స్వామి - అదితీరావ్ హైదరీతో ఘాటైన రొమాన్స్ యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. రెహమాన్ అందించిన ఈ సాంగ్స్ తెలుగులో ఏమంత బాగోలేవని వినిపిస్తోంది. ఏదో మిస్ అయిందని తన అభిమానులు చెబుతున్నారు. మరి నవాబ్ ఎవరు అనేది త్వరలోనే తెలియనుంది.

Similar News