'నవాబ్' లో అరవిందస్వామి లుక్ అదిరింది!

Update: 2018-08-14 06:13 GMT

స్టార్ డైరెక్టర్ మణిరత్నం సినిమాలంటే ఇప్పుటికీ అంచనాలు పెట్టుకుని చూసేవాళ్లు ఉన్నారు. కాకపోతే గత కొంత కాలంగా ఆయన నుండి ఒక్క సరైన సినిమా రాలేదు. 'ఓకే బంగారం' పర్లేదు అనిపించుకున్నా ఆ తర్వాత 'చెలియా'తో నిరాశపరిచారు. ప్రస్తుతం ఈయన తెలుగు, తమిళ భాషల్లో ఓ మల్టీ స్టారర్ ను తెరకెక్కిస్తున్నారు. తమిళంలో 'చక్క చివంత వానం' అనే పేరుతో.. తెలుగులో 'నవాబ్' అనే పేరుతో ఓ సినిమాను రూపొందిస్తున్నారు.

విలన్ గా అరవిందస్వామి..?

నిన్న ఈ సినిమా నుంచి అరవింద్ స్వామి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. 'వరద' అనే పాత్ర పేరుతో అరవింద స్వామిని పరిచయం చేస్తూ.. రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మాస్ లుక్ తో ఉన్న అరవింద్ స్వామిని చూస్తుంటే ఇందులో ఈయన విలన్ అన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇందులో శింబు.. అరుణ్ విజయ్.. విజయ్ సేతుపతి.. జ్యోతిక.. అదితీ రావు.. ఐశ్వర్య రాజేశ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు.

భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్

ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో విలక్షణమైన పాత్రలతో.. అనూహ్యమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఇంతమంది స్టార్స్ ఒకే సినిమాలో నటించడంతో సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు మణిరత్నం ఫ్యాన్స్.

Similar News