తమిళంలోనూ అవే పాత్రల్లో

అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నవీన్ చంద్ర. త్రిపుర, వినతి సినిమాలతో హీరోగా మంచి పేరే తెచ్చుకున్నాడు. కానీ హీరోగా అనుకున్నంత అవకాశాలు నవీన్ చంద్ర [more]

Update: 2019-03-27 10:30 GMT

అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నవీన్ చంద్ర. త్రిపుర, వినతి సినిమాలతో హీరోగా మంచి పేరే తెచ్చుకున్నాడు. కానీ హీరోగా అనుకున్నంత అవకాశాలు నవీన్ చంద్ర తలుపుతట్టలేదు. అందుకే అవకాశాలు లేవని కృంగిపోకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ రోల్స్ లో నవీన్ చంద్ర మెరుస్తున్నాడు. గత ఏడాది త్రివిక్రమ్ – ఎన్టీఆర్ అరవింద సమేతలో విలన్ జగపతి బాబు కొడుకు బాలిరెడ్డి పాత్రలో మెప్పించాడు. విలన్ గా బాలిరెడ్డి పాత్రలో నవీన్ హావభావాలు బాగా పలికించాడు. అలాగే నేను లోకల్ సినిమాలోనూ నవీన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనే నటించాడు. ఆ సినిమా తర్వాత హీరోగా మరో రెండు సినిమాలు కూడా చేస్తున్నాడు.

కోలీవుడ్ లోనూ…

ఇక టాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు నవీన్ చంద్ర విలనిజం తమిళానికి కూడా పాకింది. కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో నవీన్ చంద్ర విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. తమిళ స్టార్ హీరో ధనుష్ సినిమాలో విలన్ రోల్ ను నవీన్ చంద్ర చెయ్యబోతున్నాడు. ధనుష్ – దొరై సెంథిల్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న అసురన్ చిత్రంలో నవీన్ చంద్ర విలన్ గా నటించనున్నాడు. మరి తెలుగులో హీరోగా, విలన్ గా దున్నేసినట్లే.. ఇప్పుడు కోలీవుడ్ లోను నవీన్ చంద్ర క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా పాతుకుపోతాడేమో చూద్దాం.

Tags:    

Similar News