డిజాస్టర్ డైరెక్టర్ తో నాని?

అందాల రాక్షసి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన హీరో రాహుల్ రవీంద్రన్ కొన్ని సినిమాలు మాత్రమే హీరోగా చేసి ఆ తరువాత సైడ్ క్యారెక్టర్స్ చేసి ప్రస్తుతం [more]

Update: 2019-08-25 06:37 GMT

అందాల రాక్షసి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన హీరో రాహుల్ రవీంద్రన్ కొన్ని సినిమాలు మాత్రమే హీరోగా చేసి ఆ తరువాత సైడ్ క్యారెక్టర్స్ చేసి ప్రస్తుతం సినిమాలను డైరెక్ట్ చేస్తున్నాడు. తన మొదటి సినిమా ‘చి.ల.సౌ’ తో డీసెంట్ హిట్ అందుకున్న రాహుల్ కు ఆ తరువాత కింగ్ నాగార్జున అతనికి 'మ‌న్మ‌థుడు 2' ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈమూవీ ఈనెల ఆగస్టు 9 న రిలీజ్ అయ్యి ప్రేక్షకులని నిరాశపరిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈమూవీ డిజాస్టర్ గా మిగిలిపోవడంతో రాహుల్ తన నెక్స్ట్ సినిమా కోసం టైం తీసుకుంటాడేమో అనుకున్నారు కానీ అతను తన నెక్స్ట్ కోసం అప్పుడే రెడీ అయిపోయాడు. త్వరలోనే తన మూడో సినిమా ను స్టార్ట్ చేయనున్నాడు.

అయితే హీరో ఎవరు అనుకుంటున్నారా? మన నేచురల్ స్టార్ నాని అండి. అవును వీరి కాంబినేషన్ సినిమా అని వార్తలు వస్తున్నాయి. ఈమూవీ ని సితారా ఎంటర్టైన్మెంట్స్‌ వారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నాని గ్యాంగ్ లీడర్ సినిమా చేస్తున్నాడు. అలానే మోహన్ కృష్ణ ఇంద్రగంటి తో మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు తరువాత రాహుల్ తో సినిమా ఉండే అవకాశముంది.

Tags:    

Similar News