నర్తనశాల శాటిలైట్ రైట్స్ మరీ ఇంతా..?

Update: 2018-08-15 06:26 GMT

నాగ శౌర్య సినిమాల్లో చెప్పుకోదగ్గవి రెండే రెండు. ఒకటి 'ఊహలు గుసగుసలాడే'.. రెండు 'ఛలో'. అందులో ముఖ్యంగా నాగ శౌర్య ఫేత్ మార్చేసిన సినిమా 'ఛలో'. అతనికి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన 'ఛలో' సినిమాకు శాటిలైట్ మోస్తరు రేటుకే అమ్ముడుపోయింది. కానీ ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ విషయంలో టీవీ ఛానెల్స్ వారికి చుక్కలు చూపిస్తున్నాడట. తన సొంత బ్యానర్ లో తెరకేకించిన 'ఛలో' సినిమా తర్వాత ఇప్పుడు అదే బ్యానర్ లో 'నర్తనశాల' అనే సినిమా చేస్తున్నాడు.

మరీ నాలుగు కోట్లా..?

రీసెంట్ గా ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో శౌర్య ఈ సినిమా శాటిలైట్ రేట్ ను అమాంతంగా పెంచేసాడట. భారీ రేట్లు చెప్పుతున్నాడట. ఏకంగా 4 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడట. తన గత చిత్రాలు 4 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ తోనే పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయి.

రెండు ఫ్లాప్లు వచ్చినా...

అలాంటిది 'నర్తనశాల'కు కేవలం శాటిలైట్ రైట్స్ కే ఇంత మొత్తం చెప్పడంతో ఛానెల్స్ వారు ఖంగుతింటున్నారు. 'ఛలో' సినిమా తర్వాత శౌర్య కి వరస రెండు డిజాస్టర్స్ వచ్చాయి. అయినా కానీ 'ఛలో' సినిమానే దృష్టిలో పెట్టుకుని ఇంతలా రేట్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి అంత రేట్ కి ఏ ఛానల్ వాళ్లు వచ్చి ధైర్యం చేసి ఈ సినిమాను తీసుకుంటారో చూడాలి.

 

Similar News