ఛలో ని చూపించి భారీగా అమ్మేశారా..?

Update: 2018-08-28 06:33 GMT

నాగ శౌర్యకి కెరీర్ లో ఛలో వంటి సోలో హిట్ తగల్లేదు. అప్పటివరకు మంచి సినిమాల్లో నటించినప్పటికీ... ఆ రేంజ్ హిట్ అయితే నాగ శౌర్య అందుకోలేదనే చెప్పాలి. కెరీర్ అంతంత మాత్రంగా ఉన్నప్పుడు నాగ శౌర్య ఫ్యామిలీలో తల్లి తండ్రి, తమ్ముడు ఇలా అందరూ నాగ శౌర్య కోసం నిలబడ్డారు. సొంతంగా ఐరా క్రియేషన్స్ ని స్థాపించి ఛలో సినిమాని లోబడ్జెట్ తో నిర్మించారు. ఆ సినిమా సాలిడ్ గా హిట్ కొట్టి ఐరా క్రియేషన్ కి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. నాగ శౌర్య కి మొదటిసారి ఛలో సినిమాతో కలెక్షన్స్ సునామి అందుకున్నాడు. ఆ తర్వాత కణం, అమ్మమ్మగారిల్లు సినిమాలు బాగున్నప్పటికీ... నాగ శౌర్య కి పేరు రాలేదు. అయితే తాజాగా నాగ శౌర్య మరోసారి ఐరా క్రియేషన్స్ లో నర్తనశాల సినిమాని మొదలు పెట్టి ఆగమేఘాల మీద పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు రేపు గురువారమే రాబోతున్నాడు. ఈ ఏడాది వరసగా నాలుగో సినిమాతో నాగ శౌర్య థియేటర్స్ లోకి దిగబోతున్నాడు. ఇక నర్తనశాల సినిమా మీద ఐరాతో పాటుగా నాగ శౌర్య కి నమ్మకం భారీగా ఉంది. ట్రేడ్ లోనూ ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలతో నర్తనశాల ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో లాభసాటిగానే జరిగింది. ఇక శాటిలైట్, డిజిటల్ హక్కులకు కూడా నర్తనశాల మూడున్నర కోట్లు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇక నర్తనశాల సినిమాని తూర్పు, పశ్చిమలో గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేస్తుండగా, సీడెడ్, గుంటూరులో యూవీ క్రియేషన్స్ వారు నర్తనశాలను డిస్ట్రిబ్యూట్ చేస్తుండడం సినిమా మీద ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని కలగజేస్తుంది. నర్తనశాల ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు....

ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్ (కోట్లలో)

నైజాం 2.30

సీడెడ్ 1.10

ఉత్తరాంధ్ర 1.10

ఈస్ట్ 0.70

వెస్ట్ 0.55

గుంటూరు 0.70

కృష్ణా 0.70

నెల్లూరు 0.35

Similar News