ఎన్టీఆర్ మాస్ కాదు కాదు... ఊర మాస్..!

Update: 2018-08-15 07:22 GMT

త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో మొదటిసారి వస్తున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. జెట్ స్పీడు లో షూటింగ్ జరుపుకుంటున్న అరవింద సమేత సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగు జరుపుకుంటోంది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయాలని ఈ సినిమా నిర్మాతలైన హారిక హాసిని వారు నిర్ణయించుకున్నారు. మరి సినిమా విడుదల దగ్గర పడ్తుంది కనుక సినిమా మీద అంచనాలు పెంచడానికి అరవింద లుక్స్ తో పాటు టీజర్ తో ప్రమోషన్స్ హంగామా మొదలు పెట్టింది అరవింద టీమ్. ఇక ఈ ప్రమోషన్స్ ని కూడా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలతో మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఈ రోజు అంటే ఆగస్టు 15 న అరవింద సమేత టీజర్ ని వదిలింది.

యాక్షన్ నేపథ్యంతోనే

మరి ముందు నుండి చెబుతున్నట్టే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ రాయలసీమ భాషను దంచేస్తున్నాడు. అలాగే త్రివిక్రమ్ కూడా ఎప్పుడు ఫన్ తో కూడిన యాక్షన్ సినిమాలే చేస్తూ వస్తున్నాడు. మరి మొదటిసారి ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ తన పంథాని మార్చుకున్నాడా..? అనే డౌట్ మాత్రం ఈ అరవింద టీజర్ చూస్తుంటే అనిపించకమానదు. ఎందుకంటే... ఈ టీజర్ మొత్తం యాక్షన్ తో కూడుకుని ఉంది. మరి అస్సలు కామెడీని యాడ్ చెయ్యకుండా కేవలం మాస్ ని చూపించేసాడు. అరవింద సమేత టీజర్ లో బ్యాగ్రౌండ్ లో జగపతి బాబు వాయిస్ ఓవర్ తో స్టార్ చేసి ఎన్టీఆర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ తో ఎండ్ చేశారు. ఇక ఎన్టీఆర్ కత్తి చేత బట్టుకుని... విలన్స్ ని ఇరక్కొడుతూ.. సిక్స్ ప్యాక్ లో అదరగొట్టేసాడు. ఇక ఎన్టీఆర్ కుర్చీని ఎగరేసే సీన్ ఉంది చూశారూ.. అబ్బబ్బ ఏముందిరా అనిపిస్తుంది ఆ సీన్.

అదుర్స్ అనేలా...

ఇక ఈ టీజర్ లో మరో హైలెట్ ఏమిటంటే... ఎన్టీఆర్.. కంటపడ్డవా కనికరిస్తానేమో… వెంటపడ్డానా.. నరికేస్తా అంటూ చెప్పిన డైలాగ్ ఒక రేంజ్ లో పేలిందనే చెప్పాలి. మరి మాస్ కాదు కాదు ఊర మాస్ లెక్క ఉంది అరవింద టీజర్. ఎప్పుడూ కామెడీకి పెద్ద పీట వేస్తూ.. తన మార్క్ డైలాగ్స్ తో అదరగొట్టే త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఈ రేంజ్ మాస్ ఎంటెర్టైనెర్ తియ్యడం మాత్రం స్పెషల్ గానే చెప్పాలి. ఇక ఎన్టీఆర్ కూడా పులిలా గాండ్రిస్తూన్నాడు. అరవింద సమేత ఫస్ట్ లుక్ తోనే ఇరగదీసిన ఎన్టీఆర్.. ఇప్పుడు అరవింద టీజర్ తో దుమ్ము రేపాడు. ఇక జగపతి బాబు కూడా మాంచి పవర్ ఫుల్ పాత్రలో దర్శనమిచ్చేలా ఉన్నాడు. ఎన్టీఆర్ తండ్రిగా నాగబాబు.. అరవింద గా పూజ హెగ్డే, ఎన్టీఆర్ ఎక్స్ లవర్ గా ఇషా రెబ్బ కనబడుతున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Similar News