సెప్టెంబ‌ర్ 13న "నన్నుదోచుకుందువ‌టే"

Update: 2018-07-26 08:22 GMT

సమ్మోహనంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే.. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండడం... హీరో, హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఫ్రెష్ గా అనిపించడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఆఫీస్ మొత్తం భయ‌ప‌డే సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజ‌ర్ గా సుధీర్‌బాబు న‌టించ‌గా.. అల్ల‌రి చేసే గ‌డుస‌మ్మాయి సిరి పాత్ర‌లో హీరోయిన్ న‌భా న‌టేశ్ క‌నిపించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రెడీ అవుతున్న ఈ చిత్ర షూటింగ్ ఒక్క పాట మినహా పూర్తయ్యింది. ప్రస్తుతం పాండిచ్చేరిలో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి వినాయ‌చ‌వితి ప‌ర్వ‌దినాన సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేయాటానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 12న స్పెషల్ ప్రీమియర్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. టైటిల్ ఎనౌన్స్‌మెంట్ నుండి ప్రేక్ష‌కుల్లో ఈ చిత్రం పై అంచ‌నాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు శరవేగంగా జరుగుతున్నాయి.

Similar News