చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నాడు

ఆ మధ్య నాని హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’ కథ మొదట రామ్ చరణ్ కి వినిపించాడు గాంధీ. రామ్ చరణ్ [more]

Update: 2019-09-21 10:48 GMT

ఆ మధ్య నాని హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’ కథ మొదట రామ్ చరణ్ కి వినిపించాడు గాంధీ. రామ్ చరణ్ కి కథ నచ్చకపోవడంతో ఆ కథను నేను చేస్తానని నాని చేసి బొక్కబొర్లా పడ్డాడు. తన కెరీర్ లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో మనోడికి బుద్ది రావాలి కదా! కానీ రాలేదు రెండోసారి అదే తప్పు చేసాడు.

పల్టీ కొట్టింది….

రీసెంట్ గా రిలీజ్ అయిన గ్యాంగ్ లీడర్ కథ అల్లు అర్జున్ ది. బన్నీ కి విక్రమ్ చెప్పిన కథ నచ్చకపోవడంతో సెకండ్ హాఫ్ మార్పులు చేసి తీసుకుని రమ్మన్నాడు. బన్నీకి ఎన్ని వెర్షన్స్ విపించినా ఒప్పుకోలేదు. దాంతో ఆ కథ అలా నాని వద్దకు వచ్చింది. నాని ఏమి ఆలోచించకుండా ఓకే చెప్పేసి చేసేశాడు. దాంతో ఈ సినిమా కూడా ప్లాప్ అయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ వీక్ అని అర్ధం అయిపోతుంది. ఆడవాళ్ల తరఫు రివెంజ్‌ అంటూ మొదలు పెట్టి వారిపై ఎలాంటి సానుభూతి కలగకుండా చేసి, విలన్‌ని కూడా వీక్‌ చేసేయడంతో సినిమా పల్టీ కొట్టింది. దాంతో నాని మరోసారి గ్యాంగ్ లీడర్ తో నిరాశపరిచాడు. ఇకనైనా నాని ఏదైనా వదిలేసినా స్క్రిప్ట్స్ జోలికి పోకుండా ఉంటే చాలు. తన మార్కెట్ అలానే స్ట్రాంగ్ గా ఉంటుంది.

 

Tags:    

Similar News