ఆ హీరోతోనే క్రేజ్

నాని సినిమాలు ఒకప్పుడు వరస హిట్స్ ఉండడంతో.. ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. దాదాపుగా ఆరేడు హిట్స్ వరుసగా కొట్టాడు. దాంతో నాని సినిమాల మీద ప్రేక్షకులు ఓ [more]

Update: 2019-09-16 08:12 GMT

నాని సినిమాలు ఒకప్పుడు వరస హిట్స్ ఉండడంతో.. ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. దాదాపుగా ఆరేడు హిట్స్ వరుసగా కొట్టాడు. దాంతో నాని సినిమాల మీద ప్రేక్షకులు ఓ అంచనాకి వచ్చేశారు. నాని సినిమాకి యావరేజ్ వచ్చినా.. సినిమా చూసేందుకు బావుంటుందని. గతంలో నాని నటించిన MCA మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా విషయంలో.. క్రిటిక్స్ అంత కలిసి యావరేజ్ రేటింగ్స్ ఇవ్వగా ప్రేక్షకులు సినిమాని సూపర్ హిట్ చేశారు. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన MCA ఫ్యామిలీస్ కు కనెక్ట్ కావడంతో సినిమాకి దుమ్ము దులిపే కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా నాని గ్యాంగ్ లీడర్ విషయంలోనూ అదే జరిగింది.

నాని క్రేజ్ తో….

గత శుక్రవారం విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమా మొదటి షోకే క్రిటిక్స్ మొత్తం యావరేజ్ రేటింగ్స్ ఇచ్చారు. అయితే మొదటి రోజు పర్వాలేదనిపించే ఓపెనింగ్స్ తెచ్చుకున్న గ్యాంగ్ లీడర్ ఫస్ట్ వీకండ్ లో నాని క్రేజ్ తో సినిమా సూపర్ హిట్ కలెక్షన్స్ సాధించింది. నాని నేచురల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవడంతో ఆయన సినిమాలకు యావరేజ్ టాక్ పడినా.. సినిమాకి కలెక్షన్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి. గ్యాంగ్ లీడర్ ని మైత్రి మూవీస్ వారు నిర్మించారు. వాల్మీకి సినిమా థియేటర్స్ లోకి దిగేసరికి నాని తన క్రేజ్ తో గ్యాంగ్ లీడర్ సినిమాకి బ్రేక్ ఈవెన్ తీసుకురావడం ఖాయం.

 

 

Tags:    

Similar News