నాని చంపుకుంటూ పోతాడా?

నాని ‘జంటిల్మన్’ చిత్రంలో కొంతసేపు ప్రేక్షకులను నెగటివ్ షేడ్స్ తో మరిపించాడు కానీ.. ఎప్పుడూ విలన్ గా నటించలేదు. ఎప్పుడు కూడా కొత్తగా ట్రై చేసే నాని [more]

Update: 2019-06-13 07:49 GMT

నాని ‘జంటిల్మన్’ చిత్రంలో కొంతసేపు ప్రేక్షకులను నెగటివ్ షేడ్స్ తో మరిపించాడు కానీ.. ఎప్పుడూ విలన్ గా నటించలేదు. ఎప్పుడు కూడా కొత్తగా ట్రై చేసే నాని ఇప్పుడు మొదటిసారి ఫుల్లెన్త్ విలన్ గా ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలో కనిపించబోతున్నాడు. ‘వి’ అనే టైటిల్ తో ఎప్పుడో మొదలైన ఆ సినిమాలో సుధీర్ బాబు హీరో. నాని విలన్. అప్పుడే రెండో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ ‘వి’ సినిమాలో నాని సినిమా మొత్తం విలన్ షేడ్స్ లోనే కనిపించబోతున్నాడట. ‘విలన్’ అనే టైటిల్ పెడదామనుకున్న చిత్ర బృందం చివరికి ‘వి’ అనే టైటిల్ దగ్గరే ఆగింది.

అయితే ఫుల్ లెన్త్ విలన్ గా కనిపించబోయే నాని ఈ సినిమాలో మర్డర్లు చేస్తూ…. చిన్న చిన్న క్లూలు వదులుతూ పోతాడట. ఆ క్లూల ఆధారంగా సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నాని ని పట్టుకోవడానికి పడే కష్టాలను ఇంద్రగంటి చాలా అద్భుతంగా రాసుకున్నాడట. అయితే నాని అలా చంపుకుంటూ పోతుంటే.. నానిని నిజంగానే విలన్ అని అనుకోవడానికి లేదట. నాని అసలు వారిని ఎందుకు చంపాల్సి వస్తుందో.. అనేది సినిమా క్లైమాక్స్ లో కానీ రివీల్ అవ్వదట. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ క్రైమ్ థ్రిల్లర్ నవల ఆధారంగా తెరకెక్కుతుంది.

Tags:    

Similar News