నాని – విక్రమ్ ఇటువంటి కథా?

ప్రస్తుతం హీరో నానికి సక్సెస్ చాలా అవసరం. రీసెంట్ గా నాని పీరియాడిక్ ఎమోషనల్ లవ్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘జెర్సీ’ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో [more]

Update: 2019-01-08 06:35 GMT

ప్రస్తుతం హీరో నానికి సక్సెస్ చాలా అవసరం. రీసెంట్ గా నాని పీరియాడిక్ ఎమోషనల్ లవ్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘జెర్సీ’ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా తరువాత నాని విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్నాడు. ఇప్పటి వరకు ఇది ఎటువంటి జోనర్ అనేది బయటికి రాలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఇది హిలేరియస్ గా ఉంటుందని, సేమ్ టైం అందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పుటి వరకు నాని, విక్రమ్ ఇటువంటి కథ ట్రై చేయలేదంట. అందుకే ఇద్దరూ కలిసి ఇలా ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నారు.

ఏకంగా నలుగురు హీరోయిన్స్

సినిమా సరదాగా సాగిపోవడంతో పాటు సస్పెన్స్ కూడా ఉంటుందట. నాని కామెడీ టైమింగ్ గురించి వేరే చెప్పనవసరం లేదు. మంచి కామెడీ సీన్స్ ఉంటే కామెడీ అద్భుతంగా పండిస్తాడు. ఇక ఈ సినిమాలో ఏకంగా నానితో నలుగురు హీరోయిన్స్ నటించే అవకాశముందని తెలుస్తుంది. అయితే వారు ఎవరూ ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ని తీసుకోవాలని చూస్తున్నారు. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ వివరాలు తెలియజేయనున్నారు.

Tags:    

Similar News