నాని ఇలా చేస్తే ఎలా?

విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ – నాని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కామెడీ క్రైమ్ డ్రామా వచ్చే నెల 13న విడుదల కానుంది. నిజానికి ఈమూవీ ఈనెల [more]

Update: 2019-08-24 10:17 GMT

విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ – నాని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కామెడీ క్రైమ్ డ్రామా వచ్చే నెల 13న విడుదల కానుంది. నిజానికి ఈమూవీ ఈనెల 30 న రిలీజ్ కావాలి. కానీ అదే రోజు ప్రభాస్ సాహో రిలీజ్ అవుతుంది కాబట్టి ఈమూవీ ని వాయిదా వేశారు. ఇందులో నాని రివేంజ్ రైటర్ రోల్ చేస్తున్నారు. ఐదుగురు అమ్మాయిలని లీడ్ చేసే పాత్ర చేస్తున్నాడు నాని. షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈసినిమా రిలీజ్ కు ఇంకా 20 రోజుల వ్యవధి కూడా లేదు.

కానీ చిత్ర యూనిట్ ప్రచారం పై ద్రుష్టి సారించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ చిత్రం నుండి టీజర్, రెండు సాంగ్స్ తప్ప ఏ ప్రమోషన్స్ చేయలేదు. మరోవైపు గ్యాంగ్ లీడర్ మరో మారు వాయిదాపడిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రచారం పై చిత్ర యూనిట్ ద్రుష్టి పెట్టకపోవడం ఆ వాదనలకు బలం చేకూర్చుతుంది. తన సినిమాలు ఎంత డిఫరెంట్ గా ఉంటాయో తన ప్రమోషన్స్ కూడా అంతే డిఫరెంట్ గా ఉంటాయి విక్రమ్ కుమార్ వి. కానీ ఇంతవరకు సరైన ప్లాన్ వెయ్యలేదు. ఎంత త్వరగా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే అంత మంచిది. పైగా ఈమూవీ తో పాటు వరుణ్ తేజ్ వాల్మీకి గట్టి పోటీ ఇవ్వనుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ అందిస్తున్నారు.

Tags:    

Similar News