నాని మూవీలో విలన్ గా హ్యాండ్సమ్ హీరో..!

గత ఏడాది ఆర్ఎక్స్ 100 తో సూపర్ హిట్ సొంతం చేసుకున్న హీరో కార్తికేయ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం కార్తికేయ.. బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్ [more]

Update: 2019-02-07 07:27 GMT

గత ఏడాది ఆర్ఎక్స్ 100 తో సూపర్ హిట్ సొంతం చేసుకున్న హీరో కార్తికేయ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం కార్తికేయ.. బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఓ సినిమా, ‘హిప్పీ’ అనే మరో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా కార్తికేయకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం ‘మనం’ ఫేమ్ విక్రమ్ కే కుమార్ నానితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం విక్రమ్ ఒక హ్యాండ్సమ్ యాక్టర్ ను వెతుకుతున్నాడట.

ఆలోచించ‌కుండా ఓకే అనేశాడు

ఆ ప్రయత్నాల్లో భాగంగా విలన్ రోల్ కోసం కార్తికేయను సంప్రదించాడని సమాచారం. కథ విన్న కార్తికేయ వెంటనే ఏమీ ఆలోచించకుండా నానితో సినిమా కాబట్టి తన కెరీర్ కి కూడా ప్లస్ అవుతుందని భావించి ఓకే చెప్పేసాడని టాక్. ఇందులో కార్తికేయ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా తీర్చిదిద్దాడు విక్రమ్ కుమార్. ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్న కార్తికేయ విలన్ గా చేస్తే తన కెరీర్ పై ఏమైనా ప్రభావం పడుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

 

Tags:    

Similar News